Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పప్పకాన్నీ కన 37 కథం పునరికం భగవతః పాణినే రాచార్యస్య లక్షణం ప్రవృత్తమ్ : ? అ. పాణిన్యాచార్యు లీ శబ్దానుశాసనమును జేయుటలో శబ్దము నిత్యమని భావించెనా ? అనిత్యమని (కార్యమని భావించెనా ? వి. తాను క్రొత్తగా శబ్దములను, వానిద్వారా యర్థములను, వానికిఁగల సంబంధమును సృజించి ప్రయోగమున కందిచ్చె నని భావించెనా ? లేక సిద్ధముగానున్న శబ్దములకు, అర్థములకు వానికిఁగల సంబంధములకును వివరణముగా లక్షణమును రచించెనా ? సిద్ధే శద్దార్థ సంబంధే. సిద్ధే శద్దే అర్థే సంబంధే చేతి. అ. శబ్దార్థసంబంధములు సిద్ధములు. శబ్దము, అర్థము, సంబంధము అను మూఁడును సిద్ధములే. వి. శబ్దము నిత్యము- వైయాకరణులు 'స్ఫోట' అను రూప మున నుండుశబ్దము నిత్యమని యంగీకరించిరి. 'స్ఫోట' అనఁగా నర్థము నభివ్యక్తము చేయఁజాలునది. మనము శ్రవణేంద్రియముచే గ్రహించుశబ్దముకాక దానిచే సభివ్యక్తమై బుద్ధిలో భాసించు శబ్దమే స్ఫోట. అదియే అర్థమును ప్రకాశింపఁజేయును. అది నిత్యము. అది పదరూపమున గాని వాక్యరూపమునఁగాని యుండును. వాక్య స్ఫోటయే ముఖ్యసిద్ధాంతము. 2. అర్థము - ఇదియు నిత్యమే. శబ్దమునకు 'జాతి' లేదా వ్యక్తి యర్థమని చెప్పుదురు. 'జాతి' శబ్దముచే నాచ్యమగునపు డదియెటులును నిత్యమే కనుక అర్ధము నిత్యము. లేదా వ్యక్తి (ద్రవ్యము) శబ్దముచే వాచ్య మనిన నాఁడు గూడ ఈ ద్రవ్యములన్నియు నసత్యమగు నుపాధులతో గూడిన సత్య మగు బ్రహ్మస్వరూపములే కనుక నిత్యములు. ఇట్లు అర్థము నిత్య మని యెఱుఁగవలెను.