Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ki పాతజ్ఞుల బ మహాభాష్యము శబ్దము నిత్యమే యయిన దానిని సాధించుటకు ప్రయత్న సూపశ్యకముకాదు. గనుక వ్యాకరణము నిరర్థకము. శబ్దము నిత్యమని యంగీకరించినవారిలో ఁగూడ మత భేదములు కలవు. ణ మీమాంసకులు ఒకానొక ధ్వనిచే వ్యక్తము చేయఁబడు వర్ణ రూపమగు శబ్దము నిత్యమని యందురు. వారిమతమున 'వర్ణము' శబ్దము. అది నిత్యము. పదము వాక్యము కూడ వర్ణ సమూహరూపములే. వైయాకరణులు మనకు విన్పించువర్ణముగాని, పదముగాని వాక్యము గాని శబ్దము కాదనియు, వీనిచే బుద్ధిలో సభివ్యక్తమగు వర్ణము, పదము, వాక్యము అను మూఁడుకు నిత్యశబ్దములే యని యందురు. వర్ణస్ఫోట, పదస్ఫోట అను రెండును నిత్యములని యంగీకరించినను వాక్యమే ముఖ్యశబ్ద మనియు, నదియే నిత్యమనియు సిద్ధాంతీకరించి3. వాక్యములోని పదములు, పదములోని వర్ణములు కల్పితములే యని వివరించిరి. వైశేషికులు ధ్వనియే శబ్దమని యందుకు. ఆ ధ్వని రెండు విధములు. 1. వర్ణరూపము 2. అవర్ణరూపము. ఈ రెండువిధములగు ధ్వనియు కార్యమే (క్రియాజన్వడు - అనిత్యము) కాని నిత్యము కాదని చెప్పిరి. ఇట్టిమత భేదము లుండుటచే ప్రశ్నించుచున్నాఁడు. - సంగ్రహ ఏక త్రాధాన్యేన పరీక్షితమ్ నిత్యోవా స్యాత్ కార్యోవేతిః తత్రోక్తా దోషాః ప్రయోజనా న్యప్యుక్తాని । తత్ర ర్వేష నిర్ణయః-యద్యేవ నిక్యం, అథాపి కార్యః, ఉభయథాపి లక్షణం ప్రవర్త్య మితి. అ. శబ్దము నిత్యమా కార్యమా? యను నిషయము సంగ్రహ మను గ్రంథమున గాగుగ పరిశీలింపఁబడినది. అందలి గోషములును, ప్రయోజనములును అచటనే నివరింపఁబడినవి. నిత్యమైనను, కార్య మైనను శబ్దమునకు లక్షణము ఆవశ్వరమే యని నిర్ణయింపబడినది.