సస్పశాహ్నీ కము 85 అ. ఈ శాస్త్రమున రెండును గూడ పదార్థములుగనే భావింపఁ బడినవి. ఎట్లు తెలిసినది? పాణిని సూత్రములను రెండువిధములగు నర్థములనుగూడ అంగీకరించియే రచించెను. జాతీ పదార్థ మని భావించి "జ్యాత్యాభ్యాద మేకస్మిన్ బహువచన మన్యశిరస్యామ్" అను సూత్రమును రచించెను. వ్యక్తి పదార్థమని భావించి “సరూపాణా మేక శేష ఏక విభక్తా" అను సూ తమును రచించెను. వి. "జాత్యాభ్యాదు” మను సూత్రముచే జాతిని తెలియఁ జేయు పదమునకు ఏకత్వమునఁ గూడ బహువచనము వికల్పముగ వచ్చును. అని చెప్పెను, "బ్రాహ్మణుఁడు పూజ్యులకు" అనిన 'బ్రాహ్మ ణుఁడు' అనుపద 'మొకవ్య క్తినిగాక బ్రాహ్మణజాతిని డెలియఁ జేయును. ఇచట “ బ్రాహ్మణులు పూజ్యులు" అనికూడ ప్రయోగింప వచ్చును. ఈ సూత్రమున పాణిని శబ్దమునకు జాతి ళ యర్థమని భావించెను, "సరూపాణా మేక”శేష ఏక విభక్తా" ఒక విభ క్తిలో సమాన మైన రూపముగల శబ్దము లున్నచో నొక్కటిమిగిలి మిగిలినవి లోపించును. అను సూత్రముచే రామశబ్దము బహువచనమున ముగ్గురు రాములను తెలియఁజేయుటకు సూఁడు రామశబ్దములను ప్రయో గించిన (రామ, రామ, రామ) ఒక్క రామశబ్దము మిగిలి తక్కినవి లోపించును. ఈ సూత్రములో శబ్దమునకు వ్యక్తియే యర్థమని పాణిని భావించెను. కావున జాతి, వ్యక్తి యమునని రెండును పదమున కర్థములే యని (చూ శాస్త్రమున గ్రహింపవలెను. శబ్దార్థసంబంధ నిత్యత్వ విచారణము కింపున ర్నిత్యః శబ్దః ఆహోస్విత్ కార్యః ? అ. శబ్దము నిత్యనూ? లేక అనిత్యమా ? (కార్యమా) వి. శబ్దము ఎవరిచేతను సృజింపబడినదికాక స్వతస్సిద్ధముగా నుండునదా ? లేక ప్రయత్న జన్యమై నశించునదా? అని సందేహము;
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/68
స్వరూపం