పస్పశాహ్నికము
మగును? పూర్తిగా బ్రతికినవాఁ డీకాలమున నూతేండ్లు బ్రతుకును. విద్య నాలు/సవిధములుగా నుపయోగపడవలెను. 1. విద్యను గురువు నుండి గ్రహింపవలెను. 2. తా నభ్యసింపవలెను లి. ఇతరుల కుపదే శింపవలెను. 4. తాను వ్యవహారమున నుపయోగింపవలెను. ప్రతి పాఠముచేసిన జీవించియున్నంతకాలము అధ్యయనమై తోనే గడచిపోవును. కావున ప్రతిపదము పఠించుట యుపాయము కాదు. కథం తర్హిమే కద్దాః ప్రతిప త్తవ్యాః ? సులభమున అ. అయిన మఱి యెట్లు శబ్దములు నుపదేశింపవలెను ? కించి తాసామాన్యవిశేషవ లక్షణం ప్రవర్త్యమ్ | యే నాల్చేన యర్నేన మహతో మహతః రద్దామాన్ ప్రతిపద్యేరన్. కిం పున స్తత్ ఉక్సర్గాపవాదౌ. కశ్చి దుత్సర్గః కర్తవ్యః కశ్చి దపవాదః.
శా అ. సామాన్యలక్షణములు, విశేష లక్షణములు నుండునట్లు నిర్మింపవలెను. ఆటులైన నల్పమను ప్రయత్నముచే నధికమగు శబ్ద సమూహముల నెఱుంగ వీలగును. [ఒక జాతికిఁ జెందిన శబ్దముల స్వరూపమును బరిశీలించి యన్నిటికిని సంబంధించి యుండునట్లు సామాన్య నియమమును జేయవలెను. అట్టి సామాన్య శాస్త్రమునకు 'ఉత్సర్గము' అని పేరు. ఆ నియమముచే సాధింపఁబడని కొన్ని రూపములలో సామాన్య నియమమునకు బాధకముగ విశేష నియ మమును జేయవలెను. ఇది 'అహనాదము' అనఁబడును] ఇట్లు ఉత్సర్గాప వాదశాస్త్రములతో శాస్త్రరచనను గావింపవలెను. కథం జాతీయకః పున రుక్సర్గః కర్తవ్యః కథం జాతీయ కోపవాదః ?