Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాతజ్ఞు - మహా భాష్యము సత్యముచే భాసించువాఁడు. ఏడు సింధువులు అనఁగా ఏడు విభక్తులు. కాకుదము అన తాలువు. కాకువు అనఁగా జిహ్వ. అది మీఁదికి నెత్తఁబడును గాన కాకుదము. శబ్దము పలుకఁబడు స్థానము అను నర్థమున 'వద్' అను ధాతువునుండి “సా ఆస్మిన్ ఉద్యతే ఇతి” కాకుదం అనురూప మేర్పడును. మనము గూడ నరుణునివలె సత్యదేవులము కావలె ననిన వ్యాకరణము ఆవశ్యకము. వి. వరుణునకు 'సత్య దేవుఁడు' అను వ్యవహారము నాని వొళ్ళు ద్ధిచే గలిగినది. సత్యముచే భాసించువాఁడు సత్యదేవుఁడు. ఆ సత్యము రెండు విధములు : 1. అర్థ సంబంధి 2. శబ్ద సంబంధి. లోకములో నర్థమునకు సంబంధించిన యసత్యము నాడరాదని మన మెఱుఁగుదుము. అల్లే సాధు శబ్దమునకు బదులు అపశబ్దము నుచ్చ రించుట శబ్దాసత్యము. ఈ శబ్దానృతము కూడ సాపహేతువే. అది కూడ లేనినాఁ డగుటచే వరుణుడు సుదేవుఁ డాయెను. తాలు భాగము నుండి అభివ్యక్తములు శబ్దములు శరీరము నందలి సమస్త పాపములను, గుల్లగానున్న ఇనుప విగ్రహమునకు లోపల నున్న చిలుమును అగ్ని పోగొట్టునట్లు, పోఁగొట్టి శరీరమును ప్రకాశింపఁ జేయును, కిం పున రిదం వ్యాకరణమే వాధిజిగాంసమానేభ్యః ప్రయో జన మన్వాన్యాయతే, నపున రన్యదపి కించిత్ 'ఓమ్' ఇత్యుక్త్వా వృత్తాంతశః శమి ర్యేవమాదీన్ కణ్ణాన్ పరించి. అ. వ్యాకరణాధ్యయనము చేయగోరు నారికి మాత్రమే యీ ప్రయోజనము నెందులకుఁ చెప్పవలెను? వేదాధ్యయనము చేయువారికి ముందు చెప్పుచున్నారా? లేదు గదా! వేదము ప్రయోజనము