అభివాదము ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యో శబ్దవిద్యాసం ప్రదాయక ర్తృభ్యో గురుభ్యో మహద్భ్యః. శ్లో. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన య్కో పాకలో తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి" “మనోనాక్కాయము ల సంశుద్ధి నిమిత్తము యోగశాస్త్ర శబ్ద శాస్త్ర వైద్యశాస్త్రములను నిర్మించిన మ ని పనసుడైన పతంజలికి విన యాంజలి ఘటించుచున్నాను” అని పతంజలిని గూర్చిన యభిజ్ఞోక్తి, పతంజలి ఆది శేషుని ఆపరావతారము. శబ్ద బ్రహ్మతత్త్వము నెఱుంగుటకు వేయితల లుండవలయును. శబ్దశాస్త్ర మహత్త్వమును వివరించుటకు వేయినాల్కలు గల ఆదిశేషుఁడే కావలయును, శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరబ్రహ్మాధిగచ్ఛతి | ' అను సూ క్తినిబట్టి శబ్దసాక్షాక్కారమే బహ సాక్షాత్కార మని పెద్దల యభిప్రాయము. వ్యాకరణము వేదాంగములలో ప్రధానమైనది. ( ప్రధానమ్ లేషు అంగేషు వ్యాకరణమ్). అందువలననే 'వేదాంగముల ప్రాధాన్య మును వివరించుచు, శ్లో. ఛందః పాదౌతు వేదస్య హస్తా కల్పో ఒక పర్యతే జ్యోతిషా మయనం చక్షుః నిరుక్తం శ్రోత్ర ముచ్యతే! శిక్షా ఘ్రాణంతు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతమ్!' 2 అని వ్యాకరణ» నకు ముఖస్థాన మిచ్చినారు. అట్టి వ్యాకరణమునకు మహర్షి పాణిని రచించిన అష్టాధ్యాయి మూలసూత గ్రంథము. ఇం దెనిమిది అధ్యాయములు గలవు. 1. Sphotavada by P. 2 2. M. V. Mahasabde వైయాకరణ సిద్ధాంతముది. Intro.p
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/6
స్వరూపం