Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

$ పాతజ్ఞులు మహా భాష్యము వలెను. వర్ణలోప, వర్ణాగమ, వర్ణ వికారముల నెఱింగినవాడే వేదమును కాపాడఁగలఁడు. వి. లోకములో మనము వ్యవహరించు శబ్దములకంటె వైదిక శబ్దములు భిన్నములుగా నుండును. అట్లుందకుటకు కారణము తెలియని వారు పొరపడి వానిని తప్పులుగా తలంచి మార్చవచ్చును. లోకము లోని 'ఆదుహత' అను రూపమునకు బదులు వేదములో 'అదుహ' అనురూప ముండును, అదుహత అనుదానిలోని తకారము లోపించి, రేఫము చేసినది. అట్లే లోకములోని 'ఉద్గ్రహం-నిగ్రాహం' ఆను రూపములు వేదమున 'ఉద్గాభం-నిగాభం' అని యుండును. ఇచట హకారము భకారముగా మాటీనది. దీని నెఱు గనినాస నిధి పొరపా టని భ్రమించి వేదస్వరూపమునే మార్తుకు. కావున న్యాకరణము నెఱిఁగియుండవలెను. ఊహః బల్వపి:- న సర్వై రింగై ర్నచ సర్వాధి ర్విభక్తిభి ర్వేదే మంత్రా నిగదితాః | చావశ్యం యజ్ఞగతేన పురుషేణ యథాయథం విపరిణమయితవ్యాః|తాన్నా వైయాకరణః శక్నోతి యథాయడం విపరిణమయికుమ్ రస్తా దధ్యేయం వ్యాకరణమ్. ఊహ చేయుటకు వ్యాకరణము నెఱిఁగియుండవలెను. 'వేదములో మంత్రములు క్రియలలో నుపయోగించుట కర్తములుగ అన్ని లింగముల లోను అన్ని విభక్తులలోను చెప్పఁబడియుండవు. యాజ్ఞికుఁడు యజ్ఞ గతములను క్రియల ననుసరించి యా మంత్రములను ఆయాూలింగముల తోను ఆ యా విభక్తులతోను ఉచ్చరింపవలెను. జట్లు విభక్తులను లింగములనునూర్చుట వ్యాకరణము నేర్వనివాడు చేయఁడు. కావున అట్టి యూహ శక్తి కలుగుటకు వ్యాకరణమును నేర్వన లేను, వి. వేదములోఁ జెప్పినయాగములలో కొన్ని ప్రకృతియాగ కొన్ని వికృతియాగము లనియు వ్యవహరింపబడును, ములనియు,