పస్పశాహ్నికము అక్షరము నుచ్చరించుట యనావశ్యకమగును. “రెండును కలిసిన సము దాయము అర్థమును ఎఱింగించును ” అనిననాఁడుకూడ "మొదటి వర్ణము నుచ్చరించి రెండవ యక్షరము నుచ్చరించువేళకు మొదటి యక్షరము నశించును. కావున సముదాయ ముండనేయుండదుకదా ! ఇంక నది యెట్లు అర్థమును బోధించును? లేదా మొదటి అక్షర ముచ్చరింపఁగనే మన మనస్సులో ఒక అక్షరము అభివ్యక్తమగును అనగా స్ఫురించును. అట్లు అభివ్యక్తములైన అక్షరముల సముదాయము అర్థమును బోధించును అని యనవచ్చును. కాని అచటఁగూడ మొదట స్ఫురించిన వర్ణము రెండవవర్ణము స్ఫురించ:సరికి నాశము నొందును. కావున నిచటన: సముదాయ ముండదు. 'గోవు' అను మాటలోని రెండక్షరములను నుచ్చరించిన పిదప ఆ యనుభవమువలన కలిగిన సంస్కారముచే స్మృతికిఁ దెచ్చుకొనఁగా నా స్మృతిలో గోచరించిన వర్ణ సముదాయము అర్థమును తెలియఁజేయును, అనిననాఁడు గూడ ఆ స్మృతిలో వర్ణము లాయుచ్చరించిన వరుసలోనే యుండు నను నియ మము లేకపోవుటచే 'సరః' 'రసః' అను పదముల దుగ్ధములు తారుమా ఆగుటకుఁగూడ నవకాశము కలదు. అందుచే వర్ణములు లేదా స వర్ణముల సముదాయము అర్థబోధ కము అను వాదము సరికాదు. వర్ణవ్యతి కనుగు పదము లేదా వాక్యమే వాచక మని యంగీకరింపవలెను. అంతేకాదు. మఱియొక సంగతినిగూడ గుర్తింపవలెను. మనము ఉచ్చరించిన వర్ణ సముదా యము మనకు అర్థజ్ఞానమును గలిగింపదు. ఆ యుచరించిన వర్ణములచే 'స్ఫోట' యనఁబడు ఒక బుద్ధిగోచరమగు శబ్దము అభివ్యక్త మగును. అది మనమనస్సుచే ! గ్రహింపఁబడును. కాని అది న్యావహారిక శబ్దము నలె శ్రోత్రేంద్రియముచే గ్రహింపఁబడదు. అట్టిశబ్దమును అభివ్యక్తము చేయునది కాదను, వారముచే ఆభివ్యక్తము చేయఁబడి మనస్సుచే }
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/38
స్వరూపం