హతజ్ఞు ఆ మహాభాష్యము అథ గౌరిక్యత కః శబ్దః 'గోవు' అనునపుడు శబ్ద మననేది? కాని వి. ఎదురుగానున్న ఒక గోవును జూచీ దాని నేమని వ్యవహరిం తురో తెలియంగానే "ఆయం"? ఇదియేమి? అని ప్రశ్నించిన "ఆయం గౌ" ఇదిగోవు అని సమాధానము నిత్తున. ఇచట అడిగినవాని అభి ప్రాయము, ఆ వ్యక్తిని తెలియఁజేయు శబ్ద మేది ? యని. సమాధానములో ' ఇదిగోవు' అని శబ్దమును అర్థమును అభిన్నముగా చెప్పిరి. 'ఇది' అనఁగా ఎదురుగా నున్న గోవ్యక్తి. 'గోవు' అనఁగా ఆ వ్యక్తిని తెలియఁజేయు శబ్దము. ఈ రెంటికిని అభివము ఎట్లు పొసఁ గును? శబ్ధార్థముల నభిన్నముగా వాడుట కొన్ని తావులందు లోకమందు ప్రసిద్ధముగా నున్నది. కావున నందులో శబ్ద మననేది? అంతియే కాదు, 'గోవు' అను శబ్దమును వినినంతనే అక్షరసమూహ రూపమగు శబ్దమును, 'గోవు' ఆను ఒక వ్యక్తియు, అట్టి గోవులన్నింటి యందుండు జతియు (గోత్వము) మనకు భాసించును. వానిలో 'శబ్దము' అని వ్యవహరింపఁబడున దేది? కిం యస్తత్సాస్నాలాంగూలకువలుక విషాణ్యర్థ రూపం స శబ్దః గంగడోలు, తోఁక, సూపరము(రెంటము), డెక్క-లు, కొమ్మలు మున్నగు నవయవములతోఁ గూడిన పదార్థమా శబ్దము ? నేత్యాహ. ద్రవ్యం నామ తత్, కాదు. అది ద్రవ్యము, ఏ. శబ్దము నితేంద్రియముచే : గ్రహింపబడు ననునది ప్రసి ద్ధము. నేనుకఁజెప్పిన పదార్ధము చక్షరం దియముచే గ్రహింపఁబడు చున్నది. కావున నది శబ్దము కాదు. యక్తర్ణి తరింగికం చేష్టితం నిమిషిత మితి స శబ్దః ?
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/35
స్వరూపం