82 'ధనమూల మిదం జగత్' అనే దొక ప్రాచీన సంభాషితము, 'అర్ధస్య పురుషా దాసః' అనేది మరొకటి. 'జగద్వ్యాపారానికి ఆర్ధార్ధ సంబంధములే వునాది' అని కారల్ మార్క్సు మహాశయుడు నిర్వచించియున్నాడు. ఏ ఆధునిక సిద్ధాంతమును తీసికొన్నా దానిని ఏవో యొకచోట సంస్కృత సారస్వతములో చూడగలను. ఏ. దెట్లున్నా భావముల కేమి భారతీయులలో దారిద్య్ర్యము లేదనిపిస్తుంది. వాస్తవానికి భారతదేశంలో దేవికీ దారిద్య్ర్యం ఉండనవసరంలేదు. కాని, నేటి మన ప్రజలలోని పంగుచిక స్వార్థలు, నిష్కర్మణ్యత తొలగివస్తే మన దేశం తొల్లిటి ఔన్నత్యమునకు రాగలదు. ప్రతి చిన్న విషయానికీ యితరుల పై ఆధారపడు అధమస్థితి తొలగుటకు మన పూర్వస్థితి కొంత తెలుసుకోవాలి గదా. అందుకైన మా యీ చిన్న పుస్తకము తోడ్పడిన ధన్యులము, ఉడుతాభక్తిగా మా గావించు యీబూ కృషి ఆంధ్ర మహో దయుల ఆమోదాన్ని పొందునని ఆశిస్తాము. alp 2 మరొక్కమాట, ఆంధ్రదేశంలో అతి ప్రాచీనమైన శ్రీ గౌతమీ గ్రంథా లయంలో ఉచిత సంస్కృత తిరగతుల నారంభించ నిశ్చయించి, అందులకై కాగల వ్యయమును మా సంస్కృత ప్రచారసభ భరించదలచినది. ఆ ఉద్దేశ్యమున్ను త్వరలో ఆచరణలో పెట్టదలచియున్నాము. మా ప్రచురణములవల్ల లభించు సొమ్ముతో న, ఉదారులిచ్చు విరాళములతోను యీ సంస్కృత బోధనను కొనసాగించవలెనని సంకల్పము. బొంబాయిలో భారతీయ విద్యాధవనమువారు విశ్వవ్యాప్తముగా సంస్కృత ములో పరీక్షలు నడుపుచున్నారు. నే నచ్చటికి బోయి, వారి కార్యక్రమమును చూచి వచ్చితిని. ఆ పరీక్షలకు మన రాజమండ్రిలో కూడ ఒక కేంద్రమను ఏర్పాటు చేయుట యుక్తమని నా భావము. ఈ పథకమునకై తోడ్పడి, భారతీయ సంస్కృతిని నిల్పుటకు, పరిపుష్టు మోన రించుటకు యత్న మొనర్చుట మన విషయని మనవి గావించుకు సెలవు తీసికొందును, 1969 8. మహీధర జగన్మోహనరావు, సంచాలక కార్యకర్త, సంస్కృత ప్రచారక సభ, రాజమండ్రి.
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/33
స్వరూపం