మా మాట సంస్కృతప్రచారసభ స్థాపించవలెనను ఉద్దేశ్యము 1967 ఆరంభంలో కలిగింది. కొందఱు మిత్రులు కలిసి గావించిన యత్నాలు గోదావరి పుష్కర కాలంలో గావిం చిన మహా సభలో పర్యవసించినవి. శ్రీ కామకోటి పీఠాధిపతులు చంద్ర శేఖ రేంద్ర సరస్వతీస్వామి వా రా సభలకు అధ్యక్షత వహించి, మా యత్నముల నామోదించి, ఆశీర్వదించిరి. వారణాసి సార్వభౌమ సంస్కృత ప్రచార కార్యాలయం స్థారు కులు శ్రీ వాసుదేవ ద్వివేదీ, వేదశాస్త్రీ, సాహిత్యాచార్య మహోదయులు ఆసభలకు విచ్చేసి, సభల తరువాక నెల దినములం మాయింటనుండి, తమ కృషిని గురించియు, మా కర్తవ్యమును గురించియు చెప్పి, నాకు ప్రోత్సాహ మిచ్చిరి. నేను తెలుగులో వివిధ విషయములపై వ్రాసిన, ప్రచురించిన గ్రంథములను చూచి, సంస్కృత భాషా సారస్వతమునందున్ను ప్రబోధార్థమై సులభమైన పుస్తకములు వెలువర్చమని ప్రోత్స హించిరి. “అనేకమంది మహాపండితు లున్నారు, వారు తల పెట్టనిది ఆల్పజ్ఞుడనైన నావల్ల నేనుకును ? ఏమి చేరుగలను ?" అన్నాను వారితో. శ్రీ ద్వివేకిగా త పండితులు, కార్యకర్తలూ గూడ, ఈ రెండు గుణాలు ఒకే వ్యక్తియు గుండుట ఆరుము. వారు నావల్ల యీ కార్యక్రమము ఆరంభింపబడాలని నొక్కి చెప్పడమే గాక కాశీ వెళ్ళినతరువాతగూడ అనేక లేఖలద్వారా ఎన్ను తొందర పెట్టుకూ వచ్చిరి - చాలమందితో యీ విషయములపై చర్చించుచువచ్చారు. అనేక నగరాల్లో పండికు అను కలిసి మాట్లాడినాను. శ్రీ జటావల్లభుః పురుషోత్తం ఎం. ఏ. శ్రీమానా ప్రగడ శేషశాయిగార్లను కలిసి, కార్యక్రమము గూర్చి మాట్లాడితిని. సంస్కృత బోధనకు ఉచిత తరగతుల నేర్పాటు చెయడం, కొన్ని చిన్న చిన్న పుస్తకమాలను ప్రచురిం చడం, సంస్కృత ప్రచార సభలను స్థాపించి, అప్పుడపుడు ఉపన్యాసములు యిప్పిం చడం ప్రథమ దశలో కర్తవ్యములుగా భావించాము. ఏలూరులో శ్రీమాన్ యన్. సి. యస్. వేంకటాచార్యులు గారితో పలుమారు కలిసి, సంస్కృతభాషా ప్రచారము విషయమై ఏమి చేయగలమా ? యని ఆలోచిం చాము. అల్పమే గానీ ఆరంభం గావించాలని అప్పుడే నిర్ణయించుకొని, ముందుగా ప్రచురించవలసిన పుస్తకప్రణాళిక సిద్ధపరచితిని. 'భాగవత సుభాషితములు' అను చిన్న పుస్తకమును 151 శ్లోకములు - తెలుగు తాత్పర్యముతో సంకలనం చేసి ప్రచురించితిని, దానితో నే యీ • 'సంస్కృత ప్రచార
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/31
స్వరూపం