28 ఈతనికి భగవదనుగ్రహమువలననో స్వభావసిద్ధముగనో సాధుశబ్దములే తెలియును. కావున ఈయన ప్రయోగించుచున్న వన్నియు సాధుశబ్ద ములే అని తెలిసికొనును. (6 అ - 3 పా - అతి సూః) ఏతావతా, శిష్టవ్యవహారములో నున్న శబ్దములనే గ్రహించి వానికి లక్షణములను పాణీని నిర్ణయించె నని, పతంజలి సిద్ధాంతము. ప్రస్తుత గ్రంథము పతంజలి మహాభాష్యమునకు ఆంధ్రాను నాదము, అం దిది 'మొదటి యాహ్మికమైన పస్ప శాహ్నికము. పస్పశ మనగా, శ్లో. శాస్త్ర స్యారంభకో గ్రంథః॥ ఉపోద్ఘాక ఇతీరిక 111 స ఏవ గ్రంథసందర్భః ॥ పస్పకః కథితో బుధైః॥ అని అన్నంభట్టు నిర్వచించియున్నాఁడు. శాస్త్రారంభ భాగమునకు ఉపో దాత మనియు పస్పశ మనియు పేర్లు. ఈ పస్పశా'హ్నికములో శబ్దానుశాసన మనగా నేమి? వ్యాకరణ మే యే శబ్దములను శాసించును? వ్యాకరణమువలను ప్రయోజన మేసు, అక్షరములు, శబ్దములు, అనగా నేమి? స్ఫోటస్వరూపము, శబ్దములు జాతిద్యోతకములా ! వ్య క్తి ద్యోతకములా ? మొదలగు విషయములు చర్చింపబడును. మహాభాష్యమును ఆంగ్లములోనికి అనువదించియున్నారు. ఇట్టి మహత్తరమైన గ్రంథము నాగరికమైన యన్ని భాషలలోనికిని అనువ దింపబడవలసినదే. ఇట్టి యాశయముతోనే మా మిత్రులు శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు మహాభాష్యమును తెనుగు సేయుటకు ప్రారం భించినారు. ఇది సముదయిన కేతా మెత్తుటవంటి దుర్ఘటమైన కార్యము. సాహిత్య అకాడమీ వంటి సంస్థల పోత్సాహముతో, దై నముకూడ అనుకూలించినచో ఈ యనువాదము పూర్తికావచ్చును. మూలముకం దలి యర్థగాంభీర్యము చెడకుండ, అందలి మెలకువ లన్నియు నాంధ్రము
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/29
స్వరూపం