20 యూప, సూప అను పదములలో, యకార, సకారములు మారి అర్థములును మారును. ఇట్లే ఒక్కొక్క అక్షరము మారినప్పు డస్థాయిను మారును. వృక్షశబ్దములో వకారము లేనిచో ఋక్ష యని వేఱక యర్దము వచ్చును. ఇంకొక కారణము గలదు. అక్షరములు పదములలోని అవ యవములు. అవయవములైన అక్షరములకు అర్థ ముండుటవలననే సముదాయమైన పదమునకు అర్ధ మున్నది. ఎట్లనగా, ఒక తిలలో (నువ్వుగింజ) నూనె యున్నది గనుకనే తిలల సముదాయములో గూడ నూనె యున్నది. అవయవములైన అక్షరములు కర్ణము లేనిచో వాని సముదాయమైన పదము లకును అర్ధ ముండదు. ఒక ఇసుక రేణువులో నూనె లేనిచో వాని సముదాయములో గూడ నూనె యుండదు గదా. అక్షరముల సముదాయమున కే అర్థము గాని అందలి అక్షరము లకు అర్ధములో కొంతభాగ ముండదు. కూపము = నూయి; కావున 'కూ' అన్నచో లోతు తక్కువ నూయి గాని, చిన్న నూయి గాని కాఁజాలదు. భాషాశాస్త్ర వేత్తల యభి ప్రాయములో మహావాక్యమే అనాది మైనది. దానిని అన్థవబోధకొఱకు వైయాకరణులు విడగొట్టి (వ్యాక రించి) క్రియాకర్తృ సంబంధములను నిర్ణయించిరి. వానిని మరల ధాతు వులుగాను ప్రకృతి ప్రత్యయములుగాను విడగొట్టి శబ్దములు నేర్పఱచిరి. ఆ శబ్దములను మరల అక్షరములుగా విడదీసిరి. 1 ఆకాశమే శబ్దము. అది నిత్యము. బ్రహ్మపదార్థమువలె అదియే సత్యము. మనస్సునకు గోచరించునది శబ్దార్థముల సంబంధమే. దానికి స్ఫోట యని పేరు. అనగా అర్థరూపముగా మనకు స్ఫుట మగు శబ్దమే యది. అది తొలుత అర్థయుక్తమగు మహావాక హావాక్యము ! దానిని శబ్దము ఆ
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/27
స్వరూపం