龍 పేడనుండి లేస్తు మస్త 1 అ. 4 పా. 30 సూ. ఇ^~,గ్రూ ద్వృశ్చికాః జాయం తే) మనుష్యు లందఱు కొంచె కొంచె మిచ్చి చాలచాల కొన గోరుదురు. ఒక మాషముతో శలసహ స మాషములు కాంక్షింతురు. (సర్వే మనుష్యాః అల్పేనాల్సిన మహతో మహతో ఒర్గా నాకాం క్షంతి, ఏకేన మా షేణ శతసహసమ్) 2 అ. 1 పా. 68 సూ. ఒకే పొడుగు వెడల్పులు గల వస్త్రమునకు కాశీలో ఒక ధర. మధురలో ఇంకొక ధర. (ఇహ సమానే ఆయామే విస్తారే చ పటస్య అన్యో ఆర్థో భవతి కాశికస్య, అన్యో మాధురస్య) ఇట్టి అర్థశాస్త్ర మూలసిద్ధాంతములుకూడ ప్రసక్తాను ప్రసక్తముగ మహాభాష్యమున గానబడును. (5 అ. 3 పా. 55 సూ). భాషాశాస్త్రములో మూలసిద్ధాంతముల నెన్నిటినో పతంజలి ఆయా సందర్భములలో చర్చించి నిర్ధారణ చేసినాఁడు. అట్టి సిద్ధాంతములలో అక్షరత త్త్వ మొకటి. అక్షర మనగా క్షరము కానిది అనగా నాశము లేనిది. లేదా, నోట పలు బడునది. ణ (నక్షర మిత్యక్షరమ్, అక్ను తే ఇత్యక్షరమ్ వా) పూర్వవ్యాకరణము లలో అక్షరమునకు వర్ణ మనికూడ పేరుండెను. వర్ణజ్ఞానము వలన బ్రహ్మజ్ఞానము గలుగును. వర్ణజ్ఞానమువలన సర్వవేదములను పరించిన పుణ్యఫలావా ప్తి గలుగును. ప్రత్యేకవర్ణము లర్థవంతములా కాదా అన్నచో, ఏకాక్షర ధాతువులు, ఏకాక్షర;ప్రాతిపదికలు, ప్రత్యయములు, నిపాతలు, 'మొద లై నవి అర్థవంతములే. అక్షరముల కర్త మున్నదనుట కింకొక యుదాహరణము కలన.. ఏదియన, అక్షరములు మారినప్పుడు అర్థములుకూడ మారును. కూప,
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/26
స్వరూపం