Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24 వైయాకరణుఁడు, 'అయ్యో, నే నీ దురుతునిచే గేలిచేయఁబడు చున్నానే,' అని వాపోవును. సూతుఁడు, “అన్యూ, సూతశబ్దము 'వీ' ధాతువు నుండి నిష్పన్న మైన దనుకొని దురుతుఁ అనుచున్నావు. కాని, అది 'సూ' ధాతువు నుండి పుట్టినది. కాఁబట్టి కుత్సార్థమున తాము దుస్సూతుఁడు అనియే " అనవలెను. ” అనును. ఏతావతా, వ్యాకరణము పఠించుట మాత్రమే చాల దనియు, లోకములో, నే వ్యవహారమునకు ఇష్టికలదో గ్రహింపివలె ననియు, తేలుచున్నది. మఱియు శిబ్దము లే ధాతువులనుండి నిష్పన్నము లైనవో యెఱిగియే మాట్లాడవలె నని దీని సారాంశము. ఇట్టి జటీలమైన వాదోపవాదములతో . శాస్త్రవిషయములు నవ లీలగ చెప్పుటలో శాస్త్రము చాల మనోరంజక మైనది. (2) అ - 4 పా - 55 సూ). పతంజలి సర్వజ్ఞుఁడు. 'నఖలు ధీమతాం కశ్చి దవిష యోనామ' అన్నట్లు, పతంజలి యీ మహాభాష్యములో స్పృశింపని విషయము లేదు. పతంజలియే చరకసంహితకుఁ గర్త యని యొక సిద్ధాంతము. బార్లీ నీళ్లు మూత్రమును వెడలించు నన్న నేటీ విశ్వాస మా నాడును గలదు. (మూత్రాయ కల్పతే యవాగూ:) 2 అ - 3 పా - 13 సూ. 3+ - పెరుగును చేదుపొట్లయు ప్రత్యక్షముగా జ్వరమును కలిగిం చును. నడ్వణోదకము పాదరోగమును గలిగించును. నేయి ఆయుర్వృద్ధి కరము. దధి తపుసం ప్రత్యక్షో జ్వరః, నడ్వలోదకం పాదరోగః, ఆయుర్వై మృతం). 1అ. 1పా. రిసూ,, మఱియు, 6అ. 1పా. 32సూ. ఈ వాక్యము లియన వైద్యక పరిచయమున పరిచయమున కుదాహరణములు.