Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23 సూత్రము త్రిపాదీలోనిది. అందువలన పూర్వ తా సిద్ధనియమమువలన దీనికి ప్రక్రియలో ప్రయోజనము లేదు. అయినచో ఇకారము తీసివేయదగినదా ? నిర్ధారణ చేయను. అనగా, కాదు అని యదృచ్చా శబ్దములలో కావలయును. అనగా ఒకనికి ఇతకుఁడు అని పేరున్నచో దానిని తెలుపుటకు గావలయును. లేదా, అశక్తిజానుకరణము అనగా, ఋతకుఁడు అనువానిని ఒక బ్రాహ్మణి సరిగా పలుక లేక ఇతకుఁడు అన్న దనుకొందము. బ్రాహ్మణి ఋతకుని ఇతకుఁడు అన్నది అని చెప్పుట కీ ఇకారము కావలయును. లేదా, కృ ప్తశిఖ అని దూరాహ్వానపతములో ప్రయోగ మున్నది . కావున ఇకారము తప్పక ఉండవలసినదే అని నిర్ణయించును. రధము నడుపునాడు సారధి. ఈ యర్థములోనే సూత ప్రవేతృ ప్రాజిత శబ్దములుకూడ ప్రయోగింపఁబడును. పవేత యను శబ్దము వ్యాకరణశాస్త్రములో సాధింపబడినది. అయినను ఇదే యర్థమున పాజిత శబ్దముకూడ ఇష్టమై యున్నది. ఈ విషయమును వివరించుచు పతంజలి ఒక విచి త సంభాషణమును ఉదాహరించును. ఒక వైయాకరణుఁడు ఒక రధమువద్ద నిలబడి, “దీని ప్రవేత ఎవ్వడు ?" అని ప్రశ్నించును. (కోజస్య రథస్య ప్రవేతా?) ఒక సూతుడు, “ఆయుష్మంతుఁడా, నేనీ రథమునకు ప్రాజితుఁ డను.” (ఆయుష్మాన్, అహం అస్య రథస్య ప్రాదితా) అని సమాధా నము చెప్పును. వైయాకరణ్యుడు వెంటనే 'అది అపశబ్దము' అనును. సూతుఁడు, 'మూర్ఖుఁడా! (దేవానాం ప్రియ !) నీవు వైయాకర ణుఁడవు మా త్రమే. లోకవ్యవహారము నెఱుగవు. ఈ రూపు నకు గూడ వైయాకరణులయందు 'ఇష్టి' యున్నది అనును,