23 వర్తించునుగదా. ఎట్లనగా, చెట్టు కదల్చినచో కొమ్మలు, ఆకులు, కాయలు అన్నియు కదలున గదా. కొన్నియెడల పతంజలి సందర్భోచితము లగు చిన్న చిన్న కథ లను చెప్పుచుండును. అందోకటి యర్వాణ తర్వాణుల కథ. సామాన్యముగా శిష్టు లైనవారు అపశబ్దముల నుచ్చరింపరాదు. అయినను ఎంతటి పండితు లైనను, లోకములో అలవాటును బట్టి కొన్ని యపశబ్దములను ఎఱిగి యుండియు నుచ్చరించుట కలదు. అటులైన ఈ నియమము వలని ప్రయోజన మేమి? అన్నచో “యాభై కర్మణి నియమః” యజ్ఞాది కర్మలలోనే ఈ నియమము అవశ్యముగా అనుసరింపఁదగినది. కాని, లోకములో అంత పట్టింపు లేదు. అని పతంజలి నిర్ణయించును. మును తెలిసినవారు అయినను వాడుకలో - ఇందుల 'కాయన ఒక యుదాహరణము నిచ్చును. యద్వానః తద్వానః అను నవి సుశబ్దములు. వీని నెఱిగియుండియు వేదకాలమునం దిద్దఱు ఋషులు - సర్వధర్మములు తెలిసినవారు, పరాపరజ్ఞులు, శబ్ద స్వరూ.వ యర్వాణః తర్వాణః అని పట్టింపులేకుండ వాడుచుండిరి. అందువలన వారికి యర్వాణుడు, తిర్వాణుడు అని లోకమున వ్యవహారనామము లేర్పడి నని. యజ్ఞములలో మాత్రము వా రెప్పుడును అపశబ్దములను పయో గింపలేదు. కావున, 'ఆచారే నియమః' అనగా ఆచారకాలమందే నియమము అని పతంజలి నిర్ణయము. ఇట్లే వర్ణసమామ్నాయములో ఇ కార మేల పఠింపబడవల యను? అని ప్రశ్నించుకొనును. ఈ ఇ కారమున కెక్కడను ప్రయో జనము లేదు. ఇది అవసరమా అని సందేహమును వెలిబుచ్చి తుదికు అవసర మే అని నిర్ధారణ చేయును. ఇకార మొక్క క్ల ప్తి అను శబ్దములో మాత్రము కొనబడును. ఇదియైనను అచ్కార్యములలో అసిద్ధమే యగును. 'కృపోరోలు' అను
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/23
స్వరూపం