20 20 లేదా. "కధం అనుచ్యమానం గంస్యతే !" చెప్పనిదే ఎట్లు తెలియును అని వితర్కించి, ఒక పరిభాష యో, ఒక ఆచార్య ప్రవృ త్తియో దానికి హేతువుగా నొసంగును. వేటొకచో, 'అస్తి ప్రయోజన మేతత్ ' అని, 'ఇదియేనా ప్రయోజనము?' అనును. “కధం తర్హి” “కా కేమి ?' అని సమర్థించును. తుదకు “యధా న దోషః తథా2స్తు” “ఎట్లుండిన దోషము లేదో అశ్లీ ఉండుగాక,” అని పొరకున కే ఆ మంచిచెడ్డలు వదలి వేయును. ఎంతటి క్లిష్టవిషయములైనను లౌకిక న్యాయముల సహాయము తోను, మానవులయొక్కయు, పశుపక్ష్యాదులయొక్క యు చిత్తవృత్తుల తోను, ప్రవర్తనలతోను అన్వయించి బోధించుట పతంజలి మార్గము. సామెతలును, సాదృశ్యములును శాస్త్రవివరణములో నింత అవలీలగ వాడుట పతంజలి కొక్కనికే చెల్లినది. తర్క వేదాంత మీమాంసాది శాస్త్రములలో గూడ సులభావ బోధము కొఱకు లౌకిక న్యాయముల ననుసంధానించుట గలదు. ಅಟ್ಟಿ న్యాయములను పతంజలి మహాభాష్యములో చాలచోట్ల నుపయో గించినాడు. అపశబ్దములను శిష్టులు పదేపదే ఉచ్చరించుట దోషము కాదా? అని శంకించుకొని, అట్లుచ్చరించుటవలన వచ్చిన పాపము సుశబ్దము. లను నిర్ణయించుటవలన పోవునులే అని సమాధానము చెప్పును. దీనికి కూపఖనక న్యాయమును దృష్టాంతముగా చూపును. నూతిని త్రవ్వు వాఁడు మొదట అందలి బురదనంతను శరీరమునకు పులుముకొన్నను తుదకు అందూరిన మంచినీటిచే తన శరీరమును శు భముగా కడుగు కొనునుగదా యనును. ఇంకొక సందర్భమున నష్టాశ్వ దగ్గర న్యాయమును జూపును, ఒకనికి గుఱ్ఱములు చనిపోయినవి. వేఱకని రధము కాలిపోయినది.
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/21
స్వరూపం