Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

19 యోగవిభాగముచే ఏ రీతి నవలంబించుటలో ఏ లాభ మున్నదో చెప్పి మరల ఏదైన ప్రత్యవాయము కలదేమో చర్చించి తుదకు సూత్రా రంభమును సమర్ధించును. "యథా న్యాస మేవాస్తు” ఉన్న దున్నట్లుగానే ఉండనిమ్ము 'అని వాదము నుపసంహరించును. వ సూత్రార్థ నిర్ణయము చేయుపట్ల చిన్న చిన్న మార్పులను `సూచించుచు; ‘ఏవం క _ర్తవ్యం'; 'ఇత్యుపసంఖ్యానం'; 'ఇతి వక్తవ్యం';

  • ఇత్యస్య ప్రతిషేధో వక్తవ్యః' - అనుచు సూత్రార్థమును "తా నభిల

షించిన మార్గములోనికి వ్యాపింపఁ జేయును. నీయమ్', అనిష్ట ప్రయోగములను వారించుటకు, 'అనభిధానమ్'; 'అపాణి అని వి ప్రతిపత్తిని చూపును. - 'అపర ఆహుః' అని మతాంతరములను పరామర్శించును. లేదా అకచ్స్వరౌతు కర్తవ్యౌ', కర్తవ్యా, ముక్తసంశయా' అని నిస్సందిగ్ధ 'ముగా విధించును. కఠినమైన వ్యాకరణ ప్రక్రియలు ప్రారంభించుచు, ముందుగా 'ఇదం ఇహ సంప్రధార్యమ్' ఇది ముందుగా జ్ఞాపక ముంచుకొనవలెను అనును. తరువాతి వాదమును అర్థము చేసికొనుట కిది ముందు జాగ్రత్త -యని హెచ్చరించును. ఏదైన వాదమును పూర్వపక్షముచేయుచు, తానా వాదమును చక్కగా సానుభూతితో అనువదించి, 'విషమ ఉపన్యాసః' ' ఈ వాదము 'సరిగాదు', అని ప్రత్యేఖ్యానము చేయును. ఒక్కొక్కచో మధ్యలో ఆగి, 'కిం వక్తవ్య మేతత్' 'అయితే యిది యిట్లు చెప్పవలయునా ?' అనును. 'న వ వక్తవ్యమ్,’ 'అవసరము 'లేదు' అని, ఎందువలన అవసరము “లేదో వివరించును.