Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

18 శ్లో. స్తోష్యా మ్యహం పాదిక మౌదవాహిం। తతః శ్వోభూతే! శాతనీం పాతనీం చ (1అ. 1పా. 57 సూ.). “ఓ జ్వో భూతీ ! నేను చెప్పుచున్నాను విను. పాదికం, ఔద వాహిం, శాతనీం, పాతనీం అను చోట్ల స్థానివద్భావము ఆకారము లోపింపదు” అని శిష్యులను పేరు పెట్టి పిలిచి విధినిషేధములను చెప్పి వారి పేర్లుగూడ చిరస్థాయిగా నుండునట్లు పతంజలి చేసినాడు. మహాభాష్యములోని భాష సరళము. స్పష్టము. వివరణము నందు నిత్యవ్యవహారములో గోచరించు శబ్దములు మాత్రమే గోచరిం చును. దీర్ఘ సమాసములు గాని, దూరాన్వయములు గాని లేవు. శాస్త్రవివరణములో నత్యంతావశ్యకము లకు పారిభాషిక పదములును సాం కేతిక పదములును తప్ప తక్కిన వన్నియు నిత్యవ్యవహారములోని పదములే. భాష ఎంత సులభమో, ప్రతిపాదిత విషయములు అంత గంభీరములు, అంత అగాధములు. అయినను విషయావబోధనమునకు భాష అడ్డుతగులదు. లౌకిక దృష్టాంతములు కొల్లలు. వినోద సంభాష ణములు పాఠకులకు విషయమునం దాసక్తి రేకెత్తించును. మహాభాష్య వ్యాఖ్యానపద్ధతిలో మూడు ప్రధానాంశములు కనబడును. ఒకటి సూత్రప్రయోజనమును వివరించుట. రెండు, దళసారస్యము, అనగా ప్రత్యేక పదముల ప్రయోజనము సార్ధక్యము వివరించుట. మూడు, సూత్రముయొక్క వ్యాప్తి; అవ్యా ప్తి. ఈ మూడు విషయములను చర్చించి నిర్థారణ చేయును. సూత్రప్రయో జనమును గూర్చి చర్చ దూరంభించుచు, "కి ముదాహరణం ?” దీనికి ఉదాహరణ మేమి ? అని; “అయం యోగః శక్య మకర్తుం” ఈ సూత్రము చేయనక్కఱలేదు. అనియో వాద మారంభించును. క్రమముగా సూత్రమును రెండు మూడు రకములు పదచ్ఛేదము చేసి