17 - చుండిరి. ఆయన తన స్వగ్రామమగు గోనర్దములో నున్నను, పాటలీ పుత్రము వచ్చి పుష్యమిత్రునిచే యజ్ఞములు చేయించుచున్నను శిష్యులు వెంటనంటియే యుండిరి. ఆయన వారికి బోధించుచున్న అష్టాధ్యాయీ భాష్యము కాలక్రమమున నిర్దిష్టరూపము నంది ఎనుబది యైదు దినములలో పూర్తిచేయదగు గ్రంథమైనది. “అహ్నా నిర్వృత్తం పాఠ్యంనా గ్రంథం ఆహ్నికమ్” అని ఒక దినములో పూర్తిచేయదగు పాఠ్యప్రణాళిక ఆహ్నికమైనది. ఇందలి వివరణము కొంత గద్యము కొంత శ్లోకవార్తిక రూపము. కొన్ని ప్రశ్నోత్తరములు, కొన్ని పూర్వ పక్షములు సిద్ధాంతములుగా అనేక విధముల నీ మహాభాష్యము విలసిల్లి, నది. తాను శిష్యులకు బోధించునప్పు డెవ్వరో ప్రక్కన గూర్చుండి ఆ సంభాషణమును వ్రాసికొన్నారా? అనునట్లుగా గ్రంథ ముండును. ప్రశ్నలతో, సమాధానములతో సహేతుకముగా స్వపక్షమును సాధిం చుచు, సానుభూతితో పరపక్షమును పరిశీలించుచు ప్రత్యవాయములను జూపి మర్యాదగా పరపక్షమును నిరాకరించుచు బోవును. కొన్నిచోట్ల ప్రభుసమ్మితముగ విధించుచు, కొన్నిచోట్ల సుహృత్సమ్మిత ముగ అనున యించి సమాధానము చెప్పుచు, మఱికొన్ని యెడల చిఱునవ్వుతో పూర్వపక్షముల నపహసించుచున్న పతంజలి ప్రసన్న గంభీరమూర్తి మనకుఁ గానిపించును. అనన్యసదృశమైన యీ మహాభాష్య శైలికి ఆనాటివారు కూడ ముగ్ధులై,— 'మహాభాష్యంవా పాఠయేత్ | మహారాజ్యంవా పాలయేత్' అని తన్మయులై పలికిరి. అంతటి లోకో తరగురుని శిష్యుల పేర్లుకూడ కొన్ని మహా భాష్యము)పాటు శాశ్వతముగా నిల్చినవి.
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/18
స్వరూపం