Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వింపఁబడుటచే నీ గోనర్దీయుఁడు పతంజలికంటె భిన్ను డని వీరు తలఁచుచున్నారు.

కాని, ఈ యభిప్రాయము సరికాదు. అహంకార, మమకారములను వర్జించి తననుగూర్చి తానే ప్రథమపురుషలో చెప్పికొనుట ఆనాటి వినయప్రపత్తికి పద్ధతి యని తోఁచుచున్నది. " ప్రాయే ణాచార్యాణాం ఇయం శైలీ; య త్స్వాభిప్రాయ మపి పరోపదేశ మిద వర్ణయంతి" అని మనుస్మృతి వ్యాఖ్యానములో కుల్లూకాచార్యుఁడు వివరించినాడు. ఇట్లే కౌటిలీయార్థశాస్త్రములో “ఇతి కౌటిల్యః; ఇతి చాణక్యః;" అని కౌటిల్యుడును “ఇతి యాయావరీయః” యని తన కావ్యమీమాంసలో రాజశేఖరుఁడును, తమ్ముగూర్చి తామే చెప్పికొనుటయుఁ జూడగా పతంజలి యభిప్రాయమును తానే "“ఇతి గోనర్దీయః” అని చెప్పికొన్నట్లుగా గానబడును.

కావున మహాభాష్య మనుపేరు, అంతకుముం దొక లఘుభాష్య మున్నందువలన సాపేక్షముగ వచ్చినది గాదు. మహత్యమునుబట్టి మహాభారతము ఇత్యాదులందువలె పరిమాణగౌరవమును సూచించున దని సర్వసామాన్యముగా నూహింపఁబడుచున్నది.

పతంజలి మహాభాష్యమునకు చూర్ణి యనియు చూర్ణిక యనియు నామాంతరము లున్నవి. భర్తృహరి వాక్యపదీయపీఠికలో పతంజలిని చూర్ణికాకారుఁడు అని మూడునాల్గుచోట్ల పేర్కొనియున్నాడు. స్కందస్వామి నిరుక్తవ్యాఖ్యలో భాష్యకారుని చూర్ణికాకారుడు అని వ్యవహరించెను.

పాణినినాటి శుద్ధసంస్కృతము పతంజలినాటికి శిష్టవ్యవహారములో కొన్ని మార్పు లొందినది. ప్రాకృతాది భాషలు శిష్టేతరవ్యవహారములో నుండి, వారితో సంభాషించుటలో శిష్టుల భాషకూడ కొంతవఱకు దిగజాఱి శుద్ధసంస్కృత మనునది గ్రంథములలో మాత్రము కానబడుచుండెను. ఒక్క సుశబ్దమైన 'గో' శబ్దమునకు వ్యవహారములో,