Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 మున పతంజలికి వార్తిక కారులయందు నిరసనభావము లేదు సరిగదా, 'వారియందుగూడ సమానమైన ప్రమాణబుద్ధియు పూజ్యభావమురు గలదు. మనగా - పతంజలి వ్యాఖ్యానమునకు మహాభాష్య మని పేరు. భాష్య శ్లో. సూత్రార్ధం వర్ణ్యతే యత్ర: పదైః సూత్రానుసారిఖిః | స్వపదాని చ వర్ణ్యంతే ॥ భాష్యం భాష్యవిదో విదుః ॥ సూ తమునకు అనుకూలమైన పదములతో సూత్రార్థమును అన్వయ క్రమముగ వివరించుచు, తాను చేసిన భాష్యవాక్యములకుగూన సులభ శైలిలో మరల వ్యాఖ్యానముచేయుచు, వివరించు గ్రంథమునకు భాష్యము అని పేరు. ఇట్టి భాష్యములలో పతంజలి రచించిన భాష్యము మహో త్కృష్టమైన దగుటవలన దానికి మహాభాష్య మని పేరు. 'మహాభాష్యము'లో 'మహా' శబ్దమునకు చరిత్రకారులు చాల విధములగు కారణముల నూహించుచున్నారు. అంతకుముందే ఆక్యా వ వర్తమునందు గోనర్దము ప్రాంతములో ఒకటిరెండు చిన్న చిన్న భాష్య ములు పఠన పాఠనములలో నుండియుండు ననియు, అని అసమగ్రము లగుటవలన వానిని విస్తరింపఁజేసి పతంజలి మహాభాష్యమును రచించె ననియు వీరి యూహ. మహాభాష్యములో ఉక్తం భావభేదో భాష్యే' అనుచోటి భాష్యమును, 'ఉక్తం పూర్వం భాష్యే అనుచోటి భాష్యమును, ఇట్టి పూర్వభాష్యములకు సూచించునని వీరి యభి ప్రాయము. మఱియు, గోనర్దాయ స్వాహ, ఇష్ట మేత గోనర్దేయస్య, అను వాక్యములలో చెప్పబడిన గోవర్గీయులకు ప్రథమపురుషలో ప్రస్తా