13 పరిశుద్ధమై, వివిక్తమైన స్థలమున శాంతగంభీరమూ ర్తియై ఆసీనుఁడై యున్నాడు. దర్భపవి త్రపాణియై పూర్వాభిముఖముగ నర్ధనిమీలిత నేత్ర ములతో గూర్చుండి తన యపారమేధాశక్తిని కేంద్రీకరించి అనల్ప ప్రయత్నముతో సూత్రములను నిర్మించుచున్నాడు. అట్టి సూత్రము లలో నొక్క యక్షరమైనను, నిరర్థము కాజాలడు. అట్టిచో సూత మంతయు నెట్లు వ్యర్థమగును? అని పతంజలి విశ్వాసము. పాణినిసూత్రములు "వేదములవలె ప్రమాణము లని యీయన యాశయము. 'ఛందోవ త్సూ తాణి' అని యీయన నమ్మ మ్మకము. ఎవ్వరైన యర్థము వేఱక మార్గమునగూడ సాధింపవచ్చు నన్నచో, సాధింపవచ్చు నేమో, కాని అది అపాణినీయముగదా ! అనును. అట్టి రూపము లవశ్యము త్యాజ్యములే. కొన్ని సూత్రములలో పాణిన్యాచార్యుని ఉద్దేశమును గ్రహించి ఆ ప్రకారమైన యర్థమునే చెప్పును. పూర్వసూత్రములలోని దళముల ననువృత్తి చేసికొని సాధించి పాణిక్యాచార్యుని ప్రవృత్తియే అది యని సమర్థించును. I దాదాపు నాల్గువేల సూత్రములలోను 16 సూత్రములు మాతము, పునరుక్తము లనియో, గతార్థము లనియో, పతంజలి ప్రత్యాభ్యానము చేయును. ఈ ప్రత్యాభ్యానసందర్భములో గూడ, పాణినియండలి భక్తి, శ్రద్ధలతోనే “ఏత దేశ మాచార్యస్య మంగ ళార్థ మృశ్యతామ్" ఈ యొక్క టీమా త్రము మంగళార్థ మాచార్యులు ఈ యొక్కటిమాత్రము చేసికి, అనియు, “ప్రమాదకృత మయ మాచార్యస్య - శక్య మకర్తుం " “ఇది చేయకపోవలసినది. ఆచార్యు లిందులో పొరపడి రేమో" అనియో చల్లచల్లగా దాటి వేయును. కాత్యాయనాది వార్తిక కారులయందు గూడ పతంజలికి పూజ్య భావమే. కాగా, సూత్రకారునికిని, వార్తిక కారునకును భేదాభిప్రాయ మున్నచోట్ల పతంజలి వీలైనవఱకు సూత్రకాదనే సమర్థించి “యథా న్యాస మేవాఙస్తు" ఉన్న దున్న ట్లుండనిమ్ము అనును. అంతమాత్ర
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/14
స్వరూపం