Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12 “గావో యత్ర వర్ధంతి అతిశయేన ఇతి గోనర్దః" అనగా గోవులు పెల్లుగా నెక్కడ అంభారవములు చేయునో అది. గోనర్దము అని గోనర్దమునకు వ్యుత్పత్తిని చెప్పుచున్నారు. ఈ ప్రాంత మిప్పటికిని బహుషీరదములైన పంజాబి ఆవులకు మనికిపట్టు. గోనర్ద మన్న దా నాడు సార్థక నామము. ఈ గోనర్ద మొక పల్లెటూరు. అందువలననే మహాభాష్యములోని ఉదాహరణము లన్నియు బల్లె టూళ్లకు సంబంధించిన వే. . ఈ గోనర్దము పాణిని యభిజనమైన శాలాతుర గ్రామమునకు సమీపమున నుండియుండును. ఆ ప్రాంతము లన్నియు శతాబ్దులనుండి.. ప్రహతముగా బకనపాఠనములలో నున్న పాణిని అష్టాధ్యాయిసూ త్రము . లతో మార్మోగినవి. అందువలననే తరతరాలుగా పాణినీయము వేదకల్పమై అధ్యయనాధ్యాపనములలో నుండి, పూర్వపక్ష సిద్ధాంతము లతో ప్రతిధ్వనించి, గోనర్ద గ్రామవాస్తవ్యులకు సుపరిచితమై యుండును. దీనినే పతంజలి నాడు ఆయన తన శిష్యులకు బోధించి యు౦డును. అదియే గ్రంథస్థమై మహాభాష్యముతో మనదాఁక ప్రసా దింపఁబడినది. పతంజలికి పాణినియం దపారమైన గౌరవము. పతంజలి దృష్టిలో పాణిని ! ప్రమాణభూతుఁడైన యాచార్యుడు. ఆయన పాణిని నెప్పుడు. స్మరించినను 'భగవాన్' పాణిని ' (8అ. 4పా. 6రిసూ.) ‘అనల్పమతిః ఆచార్య పాణిని:' (1అ. 4పా. 51సూ.) 'వృత్తజ్ఞ పాణిని:' (1అ.. లేపా. 3సూ.) 'సుహృత్ పాణినిః' ( ) అనియే గాని నిరుపపదముగ పాణ్ని అనఁడు. ఆనాడు పాణిని యశస్సు ఆబాల వృద్ధము వ్యాపించినది. 'ఆకుమారం యశ: పాణినేః' (1అ. `4పా. రి9సూ.) 'ఏషా అస్య మర్యాదా' అని పతంజలి గౌరవించును. పతంజలిమనోవీధిలో పాణిని