Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9 భగవాన్ పతంజలి క్రీ. పూ. 150 ప్రాంతములయందు విలసిల్లె నని మహాభాష్యమునందలి యంతస్సాక్ష్యమునుబట్టి తెలియుచున్నది. మౌర్యరాజులలో కడపటివాఁ డగు బృహద్రథుని అతని సేనాధిపతి యగు పుష్యమిత్ర శుంగుఁడు హత్యచేసి తానే సింహాసన మధిష్ఠించె నని చారిత్రకుల నిర్ణయము. కడపటి మౌర్యులు వృషలు అని ముదా రాక్షసమున బేర్కొనబడినది. వారు వేదముల నుపేక్షించిరి. యజ్ఞ యాగాదుల శనాదరించిరి. బ్రాహ్మణహింసకులైన వీరి కాలమున వేద ములు విస్మృతప్రాయము లయ్యెను. యజ్ఞములు నష్టకల్పము లయ్యెను. ఇట్టి కాలమున బ్రాహ్మణులైన శుంగులు వృషలులైన మౌర్యులను రూపుమాపి మరల వేదములకును యజ్ఞ ములకును పునరుజ్జీవనము కల్పింప వలసిన యవసర మేర్పడెను. | పతంజలి స్వయముగ యజ్ఞములు చేసెనని మహాభాష్యము వలన తెలియుచున్నది. ఈయన షట్క రనిరతుఁడు. యజనయాజన ములు, అధ్యయనాధ్యాపనములు, తనకు విహితకృత్యములుగు నవలం బించెను. పుష్యమిత్రుని నగరిలో నుండి ఆయనచే యజ్ఞములు చేయిం చెను. అచ్చటనే శిష్యులకు వ్యాకరణాది శాస్త్రములు బోధించెను. "వర్తమానే లట్" (త్రిఅ. 2పా. 123సూ.) అను సూత్రమునకు మహా భాష్యమున ఇచ్చిన ఉదాహరణము లీ విషయములను నిరూపించు చున్నవి. “ఇహాఒధీమ హే; ఇహవసామః; ఇహ పుష్యమిత్రం యాజ యామః” “ఇక్కడ అధ్యయనము చేయుచున్నాము; ఇక్కడ నివ సించుచున్నాము; ఇక్కడ పుష్యమితునిచే యజ్ఞము చేయించు చున్నాము." అని వర్తమానకాలములో చెప్పియుండుట చేత పతంజలి పుష్యమిత్రుని యజ్ఞములలో యాజకుడై, ఆయన యాస్థానమున నుండి శిష్యులకు వ్యాకరణాది శాస్త్రములు బోధించుచు వానినే గ్రంథస్థము గావించినట్లు "చుచున్నది.