పుట:పండితారాధ్యచరిత్ర.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

పండితారాధ్యచరిత్ర

అరయ నచరలింగ మా లింగమూర్తి
యరయఁగాఁ జరలింగ మా పండితయ్య;
యసమలోకాధీశుఁ డంబికా[1]ధవుఁడు
అసమలోకారాధ్యుఁ డా పండితయ్య;
యఖిలలోకమయుండు హైమవతీశుఁ
డఖిలోకాతీతుఁ డా పండితయ్య;
లోకానుసారి ద్రిలోచనుం డిల న
లోకానుసారశీలుఁడు పండితయ్య;
యరుదగు లోకసంహారుండు శూలి
గరుణమై లోకోపకారి పండితుఁడు;
అసితకంఠుఁడు దా నసమలోచనుఁడు
భసితకంఠుఁడు శ్రీ పండితేద్రుండు;
ఊర్ధ్వైకలోచనుఁ డుడురాజమౌళి
యూర్ధ్వ[2]ద్విలోచనుం డొగిఁ బండితయ్య;
భక్తైకదేహుఁడు పరమేశ్వరుండు
భక్తసత్ప్రాణుండు పండితస్వామి;
మల్లికార్జుననామి మల్లికార్జునుఁడు;
మల్లికార్జునకీర్తి మల్లికార్జునుఁడు;
మహి[3]లోనఁ బండిత మల్లికార్జునుని

  1. రమణుఁ-డ
  2. లోచనయుగుం
  3. లోకబంధుఁడు