పుట:పండితారాధ్యచరిత్ర.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మల్లికార్జున

పండితారాధ్యచరిత్ర

దీక్షాప్రకరణము

కృతిపతినిరూపణము


శ్రీగురుమూర్తి నూర్జితపుణ్యకీర్తి
నాగమాంతస్ఫూర్తి నానందవర్తి
వృషభస్వరూపు నవిద్యాదురాపు
విషయప్రతాపు నిర్విషయకలాపుఁ
బరమకల్యాణు సద్భక్తధురీణు
శరణాగతత్రాణు సజ్జనప్రాణుఁ
[1]బ్రమదైకవిశ్రాము [2]భసితలలాముఁ
గమనీయ[3]గుణధాము గణసార్వభౌము
నీతజంగమదాస్యు [4]నిగమమయాస్యు
భూతలైకనమస్యు బుధజనోపాస్యు

  1. బ్రమథైక
  2. భక్త
  3. సద్గుణ
  4. నిగమా