పుట:పండితారాధ్యచరిత్ర.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ప్పటికి చేసిన కృషికి ఫలితముగా తేలిన సమస్తసామగ్రిని, తమవద్దనుండిన వ్రాతప్రతులను నా కిచ్చివేసిరి. వారి ఆజ్ఞప్రకారము నే నించుమించు మూడేండ్లు పనిచేసి, ఎట్లో అచ్చుకు ప్రతిని సిద్ధముచేసి, శ్రీనాగేశ్వరరావుగారికి పంపినాను. వారు వెంటనే ముద్రణమున కారంభించినారు. నేను సరిచేసిన మహిమ, పర్వతప్రకరణములను ఈలోగా శ్రీరామమూర్తి పంతులుగారు చూస్తే బాగుంటుందని వారికి పంపినాను.

నాగేశ్వరరావుపంతులుగారు శివైక్యము పొందడానికి పదిదినములకు ముందు వారిని దర్శించినాను. పండితారాధ్యచరిత్రము సంపూర్ణముగా అచ్చుపడడము చూడవలె నని ఉన్నదన్నారు. అన్నిటికి అయిదుఫారములుమాత్ర మచ్చు మిగిలినది. ఎంత తొందరపడినా వారికోరిక నెరవేరలేదు. వారి నిర్యాణానంతర మీ గ్రంథప్రకటనమును గురించిన ప్రస్తావన మరిరాలేదు. మొన్న ఏప్రిలు మాసాంతమున శ్రీవారి అల్లుళ్లయిన చిరంజీవి శివలెంక శంభుప్రసాదుగారు ప్రస్తావవశముగా గ్రంథమునకు శీఘ్రముగా పీఠిక వ్రాసి పంపవలసిన దని కోరినారు. వారి కోరిక ప్రకారము పీఠికను వ్రాయడాని కారంభించినాను. కాని, ఆపని సులభముగా కనబడలేదు. శ్రీ ప్రభాకరశాస్త్రిగారు బసవపురాణమునకు చక్కని పీఠికను వ్రాసినారు. కాని, వారి అభిప్రాయములను విమర్శిస్తూ అనేకు