పుట:పండితారాధ్యచరిత్ర.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ఇంచుమించు పదేండ్ల క్రిందట కీర్తిశేషులైన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారు మా గురువు గారైన మ.రా.రా. రావుసాహేబు గిడుగు వెంకటరామమూర్తిపంతులుగారితో పండితారాధ్యచరిత్రమును పరిష్కరించి ఇవ్వవలసిన దనిన్ని, దానిని తా మచ్చు వేయిస్తా మనిన్ని చెప్పి ఉండిరి. వారికోరిక ప్రకారము శ్రీ రామమూర్తిపంతులుగారు పండితారాధ్యచరిత్రము అచ్చుపడిన గుజిలీప్రతినిన్ని, కొన్ని తాటిఆకుల ప్రతులనున్ను, ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారములోని బ్రౌనుదొర కొన్ని ప్రతులపాఠములను గుర్తించి ఉంచిన రెండు కాగితపు సంపుటములనున్ను దగ్గర పెట్టుకొని తమకుమారులు శ్రీ వెంకటసీతాపతిగారి సహాయముతో వివిధ పాఠములను గుర్తిస్తూఉండిరి. 1932 సం॥ము ఎండకాలపు సెలవులలో నేను పర్లాకిమిడికి పోయినప్పుడు శ్రీరామమూర్తిపంతులుగారితో ఒకనెల్లా ళ్లుండడము తటస్థించినది. అప్పుడు మేము ముగ్గురమున్ను కలిసి వాదప్రకరణములో కొంతభాగమును సరిచూచినాము. నే నింటికి రావలసినతొందర కలుగడముచేతను, మాగురువుగారికి నామీద నమ్మక ముండడముచేతను, పండితారాధ్య చరిత్రమును పరిష్కరించి అచ్చుకు సిద్ధము చేసే భారమును నామీద వేసి, తా మ