2 నీలాసుందరి
అనంతమైన నీలాకాశాన సన్నని పాలపుంతలాగ విశాల
మైన ఆబీట్లో సన్నగా, తెల్లని కాలి బాట వుంది.
ఆ బాటలో నిలిచిపోయింది భద్ర.
ఆమెకి వుత్తరంగా పదిగజాల దూరాన విరగకాసి పండ బారిన కాయల బరువుతో నేలంటా కొమ్మలు వంగిపోయిన మామిడిగున్న వొకటీ, దానికి పడమరగా పదిగజాలలో వొక తుప్పా వున్నాయి.
ఏర్పరించుకోలేక భద్ర తుప్ప కేసీ, గున్న కేసీ చూస్తూ వుండగా “ అమ్ముతావా?” అంటూ మళ్ళీ మాట వచ్చింది.
" కొంటావా?””
"చిల్లరగా యిస్తావా ? ” చిల్లర వుందా ! "
"చిల్ల ర కేం లోటు టోకూవుంది కావాలంటే. ”
“చిల్లరగా యివ్వకేం, కడవల కొద్దీకూడా యిస్తాను కావాలంటే '
ఈమాట ముగియడమే తడవుగా “అలారమ్మంటావా, యిలా వస్తావా !" అనడుగుతూ, తుప్ప అవతల, విభూతి పింజె కట్లతో వొక బ్రాహ్మణయువకుడు లేచి నుంచున్నాడు.
అతణ్ణిచూసి, “ తెలవక నువ్వన్నాను, కోపం చేసుకో బోకండి అయ్యవారూ ” అంది భద్ర, వినయం కనుపరుస్తూ.
" నడిచి నడిచి తాపం యెత్తిపోయివున్నాను, కోపాని కేం గానీ - త్వరగా కసింత పెరుగు - చూడూ, వుంటే మీగడ పెరుగు -