పుట:నీతి రత్నాకరము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిరత్నాకరము

44

లేదా బలియిచ్చును. కాళికాలయమున వాఁ డపుడపుడు నాభిచారిక హోమములఁ జేయుచుండునన్న మాట నే విని యుంటిని. వాఁ డే ప్రయత్నము చేయునో తెలియదు. ఈ కార్యమును సాగకుండ నిపుడే చేసినఁ బాతాళునకు హాని గల్గును. నామూలమున నెట్టివానికిఁ గాని హాని కలుగరాదు. కావునఁ దగిన ప్రయత్నము చేసెద. కాళికా దేవి నాయందుఁ గరుణ గలదియే యని నాకు విశ్వాసము కలదు. ఆజగజ్జనని, బ్రార్థించి రాధిక కించుకే నపాయము కలుగకయుండఁ బ్రయత్నించెద." అని తలపోసి తనశిష్యులలో మిగుల నుత్తములగు వారిని నల్వురం బిలిచి రహస్యముగా నావృత్తాంతమంతయు నెఱిఁ గించి మీరు సప్తమీశుక్ర వారమునఁ దొలిజాముననే పోయి యం దెట్లో దాఁగియుండి పాతాళుడు రాధికను దెచ్చి పెండ్లి యాడఁ బూనుసమయమున వాని బంధించి కొని రండు. లేదా మువ్వు రందుండి గ్రామవాసులకుఁ దెలిపి వారిని దోడిచ్చి యొక్క ని నిట్లకుం బంపుఁడు. పాతాళుడు పెక్కండ్రం గూడి వచ్చు నేమో యనుభీతి మీ కుండదని నమ్మెదను. మీరు దేహబలముగలవారు. కృపాణపాణులగు మిము వా రెంద ఱైనను మార్కోని యోడింపఁజాలరని నావిశ్వాసము. అందును భగవతికి ధర్మపక్షమున నభిమానము మెండు. మనము న్యాయపక్షము నవలంబించువారము. న్యాయమున భగవంతుఁడుండునన్న శ్రుతు లసత్యములు కావు, కావున మీ రీవిషయమును రహస్యముగా నునిచి యా కార్యము నెఱవేర్పవలయునని తెల్పెను.