పుట:నీతి రత్నాకరము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

నీతిరత్నాకరము

మున నానందించువాఁడు. అనురూపవతియు ననుకూల ప్రవృత్తి మతియు నగుకళత్ర మాతనికుండెను. మంచి శాస్త్రపాండిత్యము గడించియు గర్విగాక శాంతధనుఁడై యేమియుఁ దెలియనివాని చందమున నుండువాఁడు. ఆతనికడఁ జదువు కొనుశిష్యులు కొందఱు గలరు. మంత్ర విద్య యాతని సొమ్మన వలయు. భరతపురమునఁ గల కాళికాదేవి కాతనియందుఁ బ్రీతి యధికము స్వప్న మున దర్శనమిచ్చుచుండును. కాని యావిషయమాతనికి నా దేవికిఁ దప్ప నితరుల కెఱుఁగఁ దరము గాదు. కొంద ఱుపాసకు లావార్తను బలుకుచుందురు. ఏది యెట్లున్నను దేవీ పూజాతత్పరుఁ డనుట కావంతయు శంక లేదు.

క్షుద్రవిద్య లాతఁ డెఱుంగఁడు. కాని పాతాళుఁ డన్యాయ ప్రవర్తకుఁడని నీచమతియని పరమఘాతుకుడని యాయన యెఱుంగును, శ్రీనివాసదా సెప్పుడో యొకప్పుడనంతాచలశర్మను జూడఁబోయి రాధికా వివాహమునుగూర్చి ప్రస్తావించియుండెను. ఆయాలోచనము మంచిదని యాతఁడు హిత ముపదేశించెను. అంతమాత్రపుఁ బరిచయమే కాని విశేషసంబంధ మాయిరు వురకు లేదు. రాధిక విద్యావతి, గుణవతి యని యాతఁ డెఱుంగును. కాన విద్యాపరీక్షా దినమున నాతఁడు నాహూతుఁడై వచ్చి మెచ్చుకొనిన వారిలోఁ బ్రథముఁడుగ నుండెను. ఆనాడు మొదలుకొని యపుడపుడు రాధిక కుశలముల నరయుచుండు వాఁడు. విశేషించి శిష్యుల మూలమున నాకన్యక కుశలముల నెఱుఁగుచుండెను.