పుట:నీతి రత్నాకరము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ వీచిక

33

టకుముందే చెప్పవలయునని యూహించితిని. నాప్రయత్న మంతయు ఫలించినపిదప నీకుం దెల్ఫి నిన్ను సంతోషింపఁ జేయ నెంచితిని ఆయూహ ఫలింపకముండే ప్రశ్నించితివి. నీకుఁ దెలుపక నే నేకార్యమైనఁ జేసినఁ బెద్ద లంగీకరింతుగా? ఇకఁ జెప్పెదను. ఆలకింపుము రామదాసు నాహ్వానించి యామహాత్ముఁడు చెప్పి సట్లు చేయఁదలంచితిని. ఆయోగి నాకు హితముపదేశించినట్లే వరునితండ్రి కింగూడ నుప దేశింపఁ గలఁడని నాభావము. దాని కొఱకే ప్రయత్నించు చున్నాఁడను. నాయీ ప్రయత్నము ఫలించెనేని మనరాధిక యనురూపుఁడగు భర్తకలదగును;అదృష్టవతులలో నుత్తమురా లగును. ప్రేయసీ! నిన్నింకను గష్ట పెట్టుట న్యాయము కాదు. శ్రీకృష్ణ దాసు జాలంధర పురమునఁ బద్మావతీ శ్రీవత్సాంకదాసులకుఁ బుత్రుఁడని సుగుణవంతుఁడని వినియున్న దానవు కదా, ఆబాలకునికే మనరాధిక నీయఁ బ్రయత్నించుచున్న వాఁడ. రామదాసుమాటయన్న నా బాలుని తల్లిదండ్రులు శిరసా వహింతురు ఆరామదాసు నాయందుఁ బరమాదరణము గల వాఁడు. కావున వారిమూలమున నీసంబంధము దృఢపడునట్లు చేయఁదలంచి యున్నాను. ఎవ్వరికే నీవిషయముఁ దెలియనీయకుము. అసూయకులు లోకమునఁ బెక్కం డ్రుందురు. జాగ్ర త్తగా మదినిల్పుకొనుము. కార్యసిద్ధియయ్యె నేని మనమే యదృష్ట వంతులము. విశేషించియే ప్రయత్నించుచున్నాఁడను. అని పలుక నాయిందిరా దేవి ప్రమోదార్ణవ పరిమగ్నహృదయ యయ్యెను. శ్రీనివాసదాసును స్వప్రయత్నమున బద్ధాదరుఁడయె యుండెను,


_________________________