పుట:నీతి రత్నాకరము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



రెండవ వీచిక

31

చెడుగులే యధికమనవలసి వచ్చును. ఈ విషయము లాలోచించియే మనవారు తల్లిదండ్రు లే వరునిఁ బరీక్షించి కొమరితకు వివాహము చేయవలయునని శాసించిరి. పౌరుషము ప్రధానముగాఁ గల రాజకన్యకలకు స్వయంవరము నిర్ణయించిరి. కొందఱు తమకొమరితలను గుమతి కిచ్చి యామెను గష్టముల పాలుచేయు చుందురు గదాయన్న లేదన రాదు. సామాన్య విధి యని విశేష విధియని రెండు విధులు గలవుకదా. ఒకానొకచోట నెట్టివిధికిని బరిహరము కలుగక మానదు. కావున దానింబట్టిచూచినఁ గష్టములకంటె సుఖములే యెక్కుడుగ నుండునని చెప్పక తప్పదు.

కన్యాపరులు పరస్పరము రూపమునుగాంచి ప్రేమించిరయే నది స్వల్ప కాలమున మార్పునొందును గాని చిరతరముగ నుండఁ బోదు. శీలగుణములం బరికించి ప్రేమింతురేని శాశ్వతముగా నా ప్రేమ ముండును. అట్లు ప్రేమించుట సర్వజనసాధారణముగ శక్యము కాదు. కావుననే పెద్దలు చిరకాలము జీవించి యరోగులు దృఢ గాత్రులు నగుట స్వానుభవమున వరాన్వేషణము చేయువని తల్లి దండ్రులదే యని తీర్మానించిరి.

శ్లో. “కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా వయః,
     బాంధవాః కులమిచ్ఛంతి పక్వాన్న మిత రే జనాః."

యనుసూక్తి యొకఁడు వినఁబడియెడు. ఈవివాహ పద్ధతి కొన్ని వేల యేండ్లుగ నలపాటుపడి చెడుగున కవకాశము లేకయున్న దనవలయు.