పుట:నీతి రత్నాకరము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

నీతిరత్నాకరము

నాయావత్సుఖదుఃఖముల కీభర్తయే పరమగతి యనుభావము వివాహాకర్మనమున నేర్పడును. ఆభావము నిశ్చంచల మనవలయును. తదనుగుణముగాఁ గన్యక యతనియందే బద్ధానురాగము కలదగును భర్తయునట్లే యనురక్తుడయి యుండును నడుమ నడుమ నేవో కుటుంబమునఁ జిక్కులు గలిగినను దృఢ తమ ప్రేమానుబంధము నవి నిర్మూలింపఁ జేయఁజాలవు. ఈవిషయమును జక్క నాలోచించియే పూర్వులు కన్యావరులకు వివాహవయోనిర్ణయము గావించిరి. అంతియకాని పదివత్సరముల కీకన్యకకు సర్వప్ర పంచవిషయములు తెలియఁగలనని కాదు.

వయస్సు చక్కఁగా వచ్చినపిదపఁ గన్యక తానే వరుని గోరుకొనుట మంచిదిగాదా యని యడుగవచ్చును. అది యంత మంచిది కాదనుటయే సమాధానము. లోక జ్ఞానము సంపూర్ణము కాఁగా నెవనిఁ బెండ్లియాడవలయునా యను చింత గలుగు. తన మేలు కీళ్ల కుఁ దానేక ర్త ననుజ్ఞానముకూడఁ గలుగు. లోకజ్ఞాన మూరక గలుగదు. పెక్కు కష్టముల ననుభవించి వానిఁ దప్పించుకొని మనవలయును. అజ్ఞానము వయస్సు మీఱినతర్వాతఁ గాని కలుగదు. విద్య కొద్దిగనభ్య సించి యాయల్ప విద్యచే లోక జ్ఞానము కలదనుకొనుచుఁ దనమేలును గూర్చి తానే ప్రయత్నించిన నది యవివేక కార్య తుల్య మగును. వరుని సుగుణదుర్గుణములను గొంతకాలము పరీక్షింపవలయును. ఆతఁడు సరిపడకున్న వేఱోకనిఁ బరీక్షించు కొనవలయును. దానఁ గొన్ని చెడుగులు గలుగక మానవు. కొన్ని విషయముల మేలుకూడ నుండుననక తప్పదు. కాని