పుట:నీతి రత్నాకరము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

నీతిరత్నాకరము

 చుండెను. దాసు సంతర్పణము చేయ సర్వసంభారములు సిద్ధము చేయించియే యుండెను. నవనీతము దెచ్చి కాఁచి నెయ్యింగూర్చి యొక సుధామయస్థలమునఁ బోసియుండిరి. అగచ్చుతొట్టి 'బాహువు మాత్రము లోతుగ నుండెను. ముహూర్తకాలము సుముహూర్తమునకు వ్యవధియుండనపు డా బాలుఁ డాడు కొనుచుఁ బోయి తటాలున నా నేతితొట్టిలోఁ బడెను. తోడి బాలురు కేకలిడిరి. శ్రీకృష్ణదా సగపడ లేదు. తల్లి పరుగునవచ్చి బాలకు నెత్తుకొనేను. ప్రాణము లంతకుముందే పోయియుండెను. ఆసాధ్వి యావిధ మెఱింగి కార్యగౌరవము నాలోచించి కంటఁ దడి పెట్టిన నిందఱకు భోజనము 'లేకపోవును. మఱియు రామదాసుగారు పిలువకయే దయచేసిరి. పండితమండల మున్నది. ఆశీర్వచన ప్రభావమున నీబుడుతఁడు బ్రదుకక యుండునా, అని నిశ్చయించి దేహము తుడిచి చెఱఁగు వానికిఁ గప్పి సుముహూర్తకాలము వచ్చుచున్నది. రమ్ము రమ్మని చీరు భర్త చెంతకుం బోయి నిలుచుండెను బాలకుఁడు నిద్రించుచున్న వాడని మేలుకొనుసమయమని యామె చెప్పుచున్నపుడు స్వరము మాఱియుండినను, ఆతొందఱలోఁ 'బెనిమిటి కనిపెట్టఁ జాలకుండెను.

అంతలోఁ గూరుచుండుఁడని పురోహితుఁడు విన్న వింప 'నెల్లరుఁ గూరుచుండిరి. పెద్దలంద ఱోక్కసారి యాశీర్వ దించిరి. వేద నాదము పరమపవిత్రము గదా. అక్షతలు చల్లిరి. అత్తఱి రామదాసుగారు చెంతకు వచ్చి “దీర్ఘాయుర్భవతు" అని యాశీర్వచించెను. బాలకుఁడు లేచి కూరుచుండెను. ఆ తల్లి యానందమునకుఁ బరిమితియుండునే, తంత్రము కొంత