పుట:నీతి రత్నాకరము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

నీతిరత్నాకరము

పద్మావతి. మంచిగుణము లీరూపమును ధరించెనా యన్నట్టు లామె యుండును. ఏమి యాదాంపత్యము ఘటించిన శతధృతి నేర్పు ? ఎంచఁదరమా యని కవికుల గ్రామణులు సమంచిత పద్య ముల నాతనిం బాడుదురు. వారికిఁ గొంత కాలమున కొక్క కుమారుఁడు కలిగెను. అతని పేరు శ్రీకృష్ణ దాసు. తల్లిదండ్రుల పుణ్యములపంటయనఁ గాదనరాదు. ఔననియే యొప్పుకొన వలయు. పంచమవర్షమున నొక నాఁడు శుభముహూర్తమున నక్షరాభ్యాసముహూర్తమును బెద్దలు నిర్ణయించిరి. మహాదాత యగు నాశ్రీవత్సాంక దాసుచే నాహూతులై కొందఱు, పిలువఁ బడకున్నను మఱిగొందఱుగాఁ బదివేలవిద్వాంసులు గూడిరి. మహారాష్ట్ర దేశమున నిఁకఁ బండితు లట్టివారు సభకు రాని వారు కలరా యనుశంక కలుగవలసినదే. అందఱుపండితు లరు దెంచిరి. 'రామదా సను యోగి పుంగవుఁ డొక్కఁ డా దేశమున నుండి పిలువని పేరంటముగా నాకస్మి కముగ వచ్చెను. ఎంత ప్రార్థించినను రానియోగి యెట్లు వచ్చినా యని పండితులు పామరులుం గూడ నచ్చెరు వొందసాగిరి. వారిరాక కాదాసు పరమానంద పరిపూర్ణహృదయారవిందుఁ డయ్యెను. మనయదృష్టమే యీమహానుభావుని దోడి తెచ్చెనని యాతనిపురం ధ్రి యూహించి నిశ్చయించెను ఏదో యొక గొప్పలాభము కలదని యాదంపతులు నమ్మిరి.

రామదాసుకథ యించుక యెఱుంగందగినది. ఆతఁ డే కులమున జనించినవాడో యెవ్వ రెఱుంగరు. ఏకడనుండి వచ్చెనో తెలియదు. ఎందుల కీదేశమున నున్నాడో యెఱుఁగఁ దరముగాదు. ఏవిద్యయందుఁ బండితుఁడని తెలియ శక్యమే