పుట:నీతి రత్నాకరము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ వీచిక

23

_ కాలములఁ బెట్టుధర్మాత్ములు గలరు. ఆకారణమునఁ దొమ్మిది దినము లుత్సవపరిమితియైనను బూర్వాపరదినములు గలిసి పదు నై దుదినము లామహోత్సవము సాగుచున్నట్లే యుండును వస్తువు లన్ని యు నల్పమూల్యమునకే దొరకును ఇన్ని కారణములచే నాభగవతియుత్సవము నేత్ర హృదయానందములను గలిగించునని యెల్లర విశ్వాసము.

జాలంధరపుర వాసులు కృత్రిమ ప్రవర్తకులు గారు. పౌరుష ప్రధానులు. పట్టుదలఁ బూని రేని “యశోవా మృత్యు ర్వా" యన్న న్యాయము ననుసరించువారే కాని నడుమ వదలు కొని 'యేడుపుమోములు పెట్టుకొని యూరక యుండువారు మాత్రము కారు. మాటయిచ్చి రేని ప్రాణమునైన లెక్కింపక సాయపడుదురు. సాధారణముగా నుపకారబుద్ధి గలవార లనక తప్పదు. జాలంధరీదేవి నారాధింపనివార లుందురాయన్న సందియమే. ఆమె కృపకుఁ బాత్రుఁడు కానివాఁడు నామ ధారియైయుండఁబోఁ డన్న నమ్మకము వారికిం గలదు. కావుననే మేలు కలిగిన నామె కరుణయే దానికిఁ గారణమని నమ్మి పూజింతురు. ప్రతివారును నుదుటఁ గుంకుమ రేఖ యునుచుకొను నలవాటు గలవారే.

అట్టి జాలంధర పురమున శుక్ర వారపుఁ బేటయందు శ్రీవత్సాంక దాసను మహాధనసంపన్నుఁ డుండెను. సుగుణముల ప్రోవని కీర్తిగాంచెను. దినదిన ప్రవర్ధమానధనుఁడై వాసిమించెను. మంచి యశము నార్జించెను. బంధుజనులఁ గాపాడి విఖ్యాతిం జెందెను. ఆశ్రితుల రక్షించి ప్రాశస్త్యమున దిక్కుల నావరించెను. ఆతనికళత్రము రూపవతియు గుణవతియు నగు