పుట:నీతి రత్నాకరము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిరత్నాకరము

22

 ననే యావల నిండ్లు కట్టుకొనుచుండిరి. ఆకారణమున నగరము విశేషభూభాగము నాక్రమించెను. కాని నడుమనడుమ రిత్త తావు లుండుటంబట్టి చూచుటకు శృంగారముగ నుండదన వచ్చును దేవాలయములు పెక్కులు గలవు. జాలంధరి యను దేవత ప్రధానస్థానము నాక్రమించెను. ఆమె పేరున నానగ రము కట్టఁబడియెననియు, నంతకుఁ బూర్వ మాయాదిశక్తి యాలయము మాత్రమే యుండెననియుఁ, గొందఱు చెప్పు దురు. పెక్కండ్ర కాగాథయందే విశ్వాసము కలిగియుండెను. జాలంధరీదేవి. భక్తరక్షణదీక్షగలదని యా నగరవాసుల విశ్వాసము.

శ్లో. “యేయథా మాం ప్రపద్యం తాం స్తవైన భజామ్యహమ్.”

అని శ్రీకృష్ణమూర్తి తెల్పెనుగదా. ఏవిశ్వాసమున భక్తు లంబ నారాధింతురో యాలాటివిశ్వాసముననే యాజగజ్జనని వారి గాపాడుచుండును. ఏటేట నాజననికి మహోత్సవము సాగును. ఆ యుత్సవదర్శనార్ధము పెక్కు దేశములనుండి వెక్క డ్రరు దెంతుకు. వారిసంఖ్య మూడులక్షలు మొదలైదులక్షల దనుక నుండునని గణితజ్ఞులు నిర్ణయించిరి. ఇంద ఱరు దెంచినను నగరమున నివాసములకు శ్రమంపడ నక్కఱ లేదు. ఎన్ని యో దేవాలయములు, మఠములు, సత్రములు గలవు, మహార్ణవమున నదు లిముడునట్టు లాయాత్రికు లా నగరాంతర్భాగమున నడఁగి పోవుదురు. కావున నామహోత్సవము సామాన్యులకుంగూడ శ్రమము గల్గింపకయుండును. స్నానముల కానగరమునఁ గోదువఁ గల్గింపని తడాకములు గలవు. సరస్సులు, వాపీకూప ములు గలవు. ఆయాయి దేవాలయములలో నన్న మాయుత్సవ