పుట:నీతి రత్నాకరము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ వీచిక

21

యని యాశీర్వదించిరి. ఆసమయమున నా కుమారికంగన్న తల్లి దండ్రుల యానందమిట్టిదని యెవ్వరు వర్ణింపఁగలరు? అది శక్య మగుపనియే కాదు. ఐన నొక్కఁడు లేచి,

తే. శీతకరు నుదయంబున ♦ సింధువట్లు,
ఘనతతిం గాంచినమయూర ♦ గణమురీతిఁ,
బరమపూరుషుఁ గన్నట్టి ♦ భక్తుపోల్కి,
నలరుచుండుత జనకుల ♦ హర్ష మెపుడు.

అని దీవించెను పద్య భావము సరసజనహృద్యమని యెల్లరు మెచ్చు కొనిరి. కర్పూరదీపమును రాధికకు నివాళించి తల్లి దండ్రులు ఘోటకశకటమున నింటికిం బిలుచుకొని పోయిరి. ఆసభా గౌరవమును బురస్కరించుకొని యాకన్య పాండితి నలుదెసల వ్యాపించెను.


రెండవ వీచిక.

జాలంధరపురము నెఱుఁగనివారు మహారాష్ట్రులలో లేరనవచ్చును. ఆపురము చంద్రభాగకు సమీపమున నుండెను. శృంగార ప్రధాననగరము కాకున్నను ధనసంపన్న నివాసము మాత్ర మగును. నడుమనడుమ గృహములు పాడుపడియుండుట యది ప్రాచీనకాలమున నత్యున్నతదశ ననుభవించినదని చెప్పక చెప్పుచుండును. ఆచోటుల మరల గృహములు నిర్మింపం బడక యుండుటం బరికింపఁగాఁ గేవల శాస్త్ర విశ్వాసవంతు లందు విశ్లేషించి కలరని తెలియవచ్చును. పాడుపడిన తావుల గృహములు కట్టరాదని వాస్తుశాస్త్ర నియమము గలదు. కావు.