పుట:నీతి రత్నాకరము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి వీచిక

19

మటుమాయము కాగా నెల్లరు చేతులు పిసికి కొనసాగిరి. రాధిక మాత్ర మా కాలాహింగానక తన పని దాఁ జేయుచుండెను. అహితుండికుఁ డేదో యొకమూలికను జేతనుంచుకొని దాని ప్రక్కనే చూ చుచు జాగరూకుఁ డై యుండెను.

కొంత సేపటికిఁ దద్దృషులు తీవ్ర రూపమును వదలేను. నిశ్వాసమారుతములు శీతలము లయ్యెను. ముష్పదాఱంగుళ ముల యెత్తుననుండు ఫణము పదియంగుళములకుఁ దగ్లెను, కన్నులు మూఁతపడియెను. నివాత దీవకళికంబోలి యుండెను, ఎల్లవా రచ్చెరువుపడి చూడసాగిరి మూడుముహూర్తము లనఁగా నాఱుగడియ లట్లే యుండెను. ఆకాలాహికి సృతి కలదా యనుశంక గలుగఁజొ చ్చెను. సర్పమున్న దా యనుకొన సాగిరి శాస్త్రి లేచి యెవరుగాని దానిని దాఁకుఁడు, అది 'యేమియు ననఁజాలదు. రండు రండు. ధీరోత్తములు లెండు. రండు. అని బతిమాలసాగెను. కిందుచూచువారు కొందఱు పర ధ్యానము నభినయించువారు కొందఱు నైరి గాని లేచు వాఁడు గాని, లేవ నుంకించువాఁడు గాని, లేవ నూహించు వారుగాని మందున కందు లేకుండిరి. అహితుండికుఁడే నాలుగుమాఱులు పెట్టెను గదలించెను. ఫణాగ్రమున నడఁ చెను. ఏమియుననక యది శవముగఁ గన్పట్టెను. ఇదేమి మాయయా, ఔషధ ప్రభావమా, యని యేల్ల రచ్చెరువం దుచుఁ జూడసాగిరి. శాస్త్రీ, లేచి యార్యమహాశయులారా! సంగీతశాస్త్ర పరీక్ష యనఁగా నిట్టిది, శంకరాభరణ నామముగల యీ రాగము సర్పములకుఁ బ్రీతికరము. దానియందు షడ్జ స్వరము మయూరాధిదైవతమగుట వానికి విరోధము. ఆ విధ