పుట:నిజం కూద అబద్దమె.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జరగాలి అనుకోవాలి 45 చం చం– నువ్వు నన్ను అసలు ప్రేమించందే ! లీ- ఓ పనిచేస్తే బాగుండేది... అదంతా ఎందుకు లెండి ఎవరిదారి వారి దయేటప్పుడు ! చం-అంతే! లీ——అవును, అది యిందాకానే స్థిరపడిందిగా! చం—ఆమాట అంత లీలగా మాట్టాడతా వేం, లీలా ? లీమీ మోస్తరుగా ఉండడానికే. . నా మోస్తరుగానా ! లీ-అవును. మనం ఎవర్నే నా వదులుకునే టప్పుడు దుఃఖిస్తున్నాం అని వాళ్ళకి తెలియ నియ్యకూడదు. చం—దుష్టురాలా ! నువ్వే వదులుకోవాలని కోరతా ! లీ- నేనా ! మీరే! చం–నే నీకు ఆనందం కలిగించడానికే ఇందాకణ్ణించీ, యత్నం! లీ--మీ ఆనందంకోసమే గావును. చం- నేను పశ్చాత్తాప పడ్డానుగా ! లీ—వద్దండీ ! అల్లాం టప్పుడు క్షమించకుండా ఉండ లేను, నేను. చం-అయితే నన్ను క్షమించి, ఎప్పట్లా నన్ను కటాక్షించు, లీ-అబ్బ ! మా యిష్టం అండీ !