పుట:నారాయణీయము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24


కారు. 'దారికా శ్శీతవేపితాః' అను భాగవతశ్లోక వ్యాఖ్యానమున శ్రీధర పండితులు “దారికాః, అక్షతయోనీ రిత్యర్థః" అని సెలవిచ్చిరి. వారు కన్యలు కుమారికలు అనుమాట మఱువరానిది. కృష్ణుని తమకు భర్తను చేయుమని కాత్యాయనీ దేవిని ప్రార్థించుచున్నారు. వారు ప్రౌఢలు కాఁగూడదా? యందు మనిన వారు దిగంబరలైన యవస్థలో చీరలు దొంగిలుట గాని, వారిని నీటనుండి బయటికి రమ్మనుటగాని యౌచిత్యమునకు దూరమగును. బాలలు గావున పరిహాసార్థము హరించినట్లు చీరలను హరించుట మార్దవమును దాటని కృత్యము. భగవంతుఁ డిట్టి యల్పతకుఁ బాల్పడవచ్చునా ? అని సంశయము కలుగక మానదు. కాని తనయెడ ననుర క్తలై, భక్తలైన గోప కుమారికల యెడ భగవానునకు పరిపూర్ణ కరుణ కలిగినది. అయినను వివస్త్రలై యమునా నదీ స్నాన మొనర్చు నధర్మమునఁ గలిగిన పాపము తొఱఁగనిదే తాను స్వీకరింపఁడు గానఁ గృష్ణపరమాత్మ వారిని గాఢమగు చలిలో జలవ్యాస రూపప్రాయశ్చిత్తమున పరిశుద్దలను గావించి, దేహాభిమానము గూడఁ దొలఁగింపఁ జేతులెత్తి మ్రొక్కుఁడని మ్రొక్కించుకొని తన హృదయాంతరమున వారికి స్థానమిచ్చి మన్నించినాఁడు.

హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికాః
చేరు ర్హ విష్యం భుంజానా మాసం కాత్యాయనీవ్రతం."
            ....... ........ ........
తతో జలాశయా త్సర్వా దారికా శ్శీతవేపితాః.

ఇత్యాది భాగవత విషయము చూచిన సర్వ మవగతమగును. శాఖా చంక్రమ మగునని, యది విడిచి నారాయణీయము నరయుదము గాక.

“చారు విలోకనల్ నదికిఁ జాగి యుషఃప్రభ వెంబడింప శృం
 గారము లోల్కు నీ కతలు గానము సేయుచు గౌరిఁ గొల్చి యొ
 య్యారము భక్తిఁ గొల్పి యువహారశతమ్ములు నిల్పి యంబికన్
 గోరిరి నందసూనుఁ దమకుం బతిసేయు మటంచుఁ బొందికన్."

"ఈవిధి నొక్క మాస మొనరించిన నోము" - అది. “కన్నియ లావ్రతమ్ము తుదఁ గట్టిన చీరలు విప్పి గట్టునన్ , గ్రన్ననఁ బ్రోవువెట్టి యమునా సలిలమ్ముల నోలలాడుచున్" ఉన్నారు. అట్లు విస్త్రలై నదిలో స్నానమాడుట ధర్మోల్లంమనము. వా రెఱుఁగక యుత్సాహమునఁ జేసిన యీ యకార్యజనిత పాపము తొలఁగింప దయాళువై నీవు రాఁగా,