పుట:నారాయణీయము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23


కిది వివరింపఁబడినదే కాని యిట్టి వ్యాకరణ చిత్రములు దీక్షతకవివరుని వై దుషీ విలసిత భాషితములం దసంఖ్యాకములు.

కవితాగుణములలో ముఖ్యమనిపించుకొన్న సౌకుమార్యము మూర్త మైనట్లున్న యీ రెండు పద్యముల నిందుదాహరింపక విడువ మనసొప్పకున్నది.

"ఇది పవడంబు డంబు హరియించు పద మ్మిటు గంటువోయె నొ
 ప్పిదము దొఱంగి, కందినవి బిడ్డనిచేతులు తమ్మిపూవులం
 చదిర! కృపాతగంగిత హృదంతరలై తరలాక్షులెల్ల ని
 న్నెదఁ గదియించి మేన్పులకరింపుల ముద్దులు వెట్టిరంతట౯."

"అమ్మకచెల్ల ! చిన్నశిశు వప్పరమేశు కృపాతరంగ, పా
 తమ్మిటు నెట్టి నంతటఁ గదా యొక యొడ్డును బట్టి దక్కినాఁ
 'డిమ్మిటు తె' మ్మటంచు నిను నెత్తి కవుంగిటఁ జేర్చి నందుఁడ
 బ్రమ్మగు హర్షముం బడసె నమ్మెయి నెమ్మెయి పుల్కరింపఁగ౯."

మల్లెపూలు మాలికగాఁ గ్రుచ్చినట్లు సుకుమారములగు నలఁతిపదములతో నిగుంఫితములగు నీ పద్యద్వయము సుందరమే కాదు, సురభిళముగూడను.

“స్తనకుంభమ్ములఁ బాలుచేపఁగ యశోదాదేవి నా తండ్రి ! ర
 మ్మనుచు౯ నిన్నొడిఁ జేర్చి పాలొసఁగుచో నంతంత లేనవ్వు లిం
 పెనయ౯ వచ్చియు రాని పల్వరుస నెం తేని౯ నిగారింపు చెం
 దిన నీమో మటు చూచి గోపి మురియు౯ నీతోడిదే లోకమై.

ఇందు ప్రతిపదమును వత్సలరసము జిల్లునఁ జల్లుచున్నది. ప్రసాద సౌకుమార్యములు పెనవేసికొని మెఱయుచున్నవి. ఈ రీతిగా ప్రసాద, సౌకుమార్య, మాధుర్య, కాంత్యాది సకల కవితాగుణములతో గాంగఝరీ సదృశముగా నడచిన శ్రీ సుబ్రహ్మణ్యదీక్షిత కవివరుని యిమ్మహాకావ్య రత్నాకరమున నెన్నియని రత్నముల నెత్తి చూపఁ గలము? గుణగ్రహణ ధురీణులగు సహృదయు లామూలాగ్రము చదివి యానందవైవశ్య మొందవలసినదే. కాని సిక తాకూప ఖనననమునకు దిగి యతృప్తినొందుట యుచితము కాదని యొకటి రెండు ఘట్టములు మాత్రము చూపింపక మానఁజాలకున్నాను.

గోపికా వస్త్రాపహరణ ఘట్ట మొకటి ముఖ్యమేకదా ! అందు కాత్యాయనీ వ్రతము నాచరించుచున్న వారు గోపకన్యలేకాని ప్రౌఢలగు గోపికలు