పుట:నారాయణీయము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21


"గృహ్ణాన శ్చికురేషు తాం ఖలమతి శ్శౌరే శ్చిరం సాంత్వనై
 ర్నో ముంచన్ పునరాత్మజార్పణ గిరా ప్రీతోథ యాతో గృహాన్
 ఆద్యం త్వత్సహజం తథార్దిత మపి స్నే హేన నాహన్న సౌ
 దుష్టానా మపి దేవ పుష్ట కరుణా దృష్టా హి ధీ రేకదా."

అను మూల శ్లోకములోని దేవకి కొప్పుపట్టుకొని కంసుఁడు కత్తి నెత్తెనను నంశము వదలినను. 'వసుదేవుని సాంత్వన వాక్కులచేఁ జెల్లెలి కొప్పు విడువఁ డాయె' నను దానిలోని సాంత్వన వాక్కులు వివరముగాఁ దెల్పఁబడినవి.

'అయ్యయొ పెండ్లికూతురు గదయ్య సహోదరిఁ బ్రోవుమన్న వాఁ డియ్యకొనండు' అని మార్పు చేయఁబడినదే కాని, 'పునరాత్మజార్పణగిరా ప్రితో౽థయాతో గృహాన్ ' అను వాక్యము పుట్టఁగనె యెల్ల కుమారులఁ దెచ్చియిత్తునా, నియ్యకొనె౯' అని యనువదింపఁబడి, మూఁడవ పాదమునందలి యర్థము సమగ్రముగా స్ఫురించునట్లు సూత్రప్రాయముగా 'యదూద్వహుఁడు నిచ్చెను దొల్తటి బిడ్డఁ-జంపరాఁడయ్యెను వాఁడు' అని తెలుపఁబడినది. నాల్గవ పాదమునఁగల యర్థాంతరన్యానము - అను వాదమన వీలులేకుండ "ఱాకటికియై సుతిమెత్తన చిత్త మొ క్కెడ౯' అని రేఖామాత్రముగా మధురమగు తెనుఁగులో నెంతయు మెత్తగాఁ దెల్పఁబడి యాంధ్రహృదయముల హత్తుకొని పోవు చున్నది. జాతివలెఁ గఠినమైనదైనను జిత్తమొకప్పుడు సుతి మెత్తన యగుచుండు నని దానిభావము - అనువాదమున నీ పాటి స్వాతంత్ర్యముకూడ లేకున్న యెడ సొగసు రానేరాదు.

కృష్ణుఁడు జననమైనాడు. కేయార కిరీట కంకణాదిభూషణములతో జతుర్భుజుఁడై పురుటిల్లు మెఱసిపోవ వెలుగుచున్న యాదేవునిరూపము నారయు చున్న వసు దేవుఁడు

“ధిరోదాత్తము యోగిబృందము సమాధిం బట్టుకోలేని యా
 కార మ్మెట్టెదురై కనుల్ చెమరుపంగా, మై గగుర్పాటు పొం
 గార౯, గందొవఁ దేనెతేటయయి, డాయ౯ నిండు సౌందర్య భాం
 డారమ్ము౯౯ గని హర్షగద్గదికతోడ౯ శౌరి డా నిట్లను౯".

యోగులకు సమాధియందుగూడ బట్టువడనిదఁట శ్రీకృష్ణభగవానుని రూపము! అట్టి యాకార మెట్టయెదుట వసుదేవుఁడు గాంచినంతటనే : యతని కన్నులు చెమర్చినవఁట. మేనంతయు రోమాంచితకంచుకిత మయ్యెనట. కంఠమున