పుట:నారాయణీయము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7


యానాఁడు నారాయణీయ కృతిసమర్పణ మహోత్సవము వర్ణించుటలోఁ దాను 'నిరవధి' యనుకొనిన రాయని భాగ్యము నిరవధిక శోభాయుక్త మైనిరవధి కానంద మెల్లరకుఁ గూర్చుచున్న దే!

సీ. ఒక వంక శ్రుతిఘోష మొకట మంగళదివ్య
               వాద్యఘోషమ్ములు పరిఢవిల్ల
    నొక వంక మళయాళ సుకవి విద్వద్భక్త
               తతులెల్ల వందిబృందమ్ము గాఁగ
    నొక వంక రాష్ట్రపాలకులు రక్షకభట
               ద్విరదకోటులు బరాబరులు సేయ
    నొకవంకఁ బుణ్యాంగనోదారబాలకో
               కిలగాన కలకలమ్ములు సెలంగ
    రమణ స్నాతానులిప్తులై రామకృష్ణ
    పుణ్యదంపతులున్ బాబు ముద్దులాడి
    యెత్తికొనిరాఁగఁ గృతికన్య నేను బూని
    తమ్ముఁడున్ దోడ రా నాలయమ్ముఁ జేర .

కేరళదేశమునకు నధినాయకుఁడు. (గవర్నరు) గావున ఆయన కంత వై భవముండెనని వర్ణించుట స్వభావోక్తి యే కాని యిసుమంతయు నతిశయోక్తి కాదు. అభ్రాతృకన్యాదానము కాకుండునట్లు పుత్త్రునితో " ధర్మపత్నీసహితముగా శ్రీరామకృష్ణారావు పాదచారియై దేవాలయమునకుఁ జేరెననుటలో నాయన ధర్వజ్ఞతయు భక్తిప్రపత్తులును వ్యక్తములగుచున్నవి.

అట్లా దేవాలయము చేరిన పిదప

ఉ. చెంగట మ్రోసె ఘంట లభిజిత్సమయంబున, నంత నాలయ
    ప్రాంగణమందు నిల్చి యిభరాజముఖున్ భజియించి, నేనునున్
    మంగళవాద్యఘోషముఖ మండపమందుఁ గృతిం బఠింప, ను
    ప్పొంగుచు రామకృష్ణులు విభున్ వినుతించిరి పర్యభంగిమన్.

“హేమలంబ శరదాశ్వయుజోదిత కృష్ణపక్షపంచమి రవివాసరమ్మున నభిజిల్లగ్నమున దేవాలయఘంటలు ఖంగున మ్రోగుచుండ వినాయకునిభజించి దీక్షిత కవిమౌళి కృతిని శ్రీ గురువాయూరు దైవతము 'నవధరింపుము దేవా ' యని వినిపించెనఁట. తోడనే రామకృష్ణారాయ మహాశయుఁడును