పుట:నారాయణీయము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6


టయుఁ, దన యేలుబడిలోని గురువాయూరు పురమున నెలకొనిన నారాయణస్వామి దేవుఁడే కృతి కాలంబమే గాక కృతిపతిగాఁగూడ నగుటయు హేతువులు గాఁబోలును. శ్రీ రామకృష్ణారాయప్రభువు తాను రెండుమూఁడు భాషలందు నుత్తమకవి యయ్యును, నారాయణీయాంధ్ర కావ్యమును దత్తపుత్త్రికగా స్వీకరించి యా దేవున కే తాను ధర్మపత్నీయుక్తుఁడై కృతిగ నొసంగినాఁడు. గుణగ్రహణ పారీణతకును, కవితాసక్తికిని, భగవద్భక్తికిని నీ సన్నివేశము నిదర్శనము కాక మానదు. ఈ దత్తపుత్త్రి కా స్వీకరణమున నింకొక ధర్మరహస్యముగూడ నున్నట్లు దీక్షితకవి వాక్కులందు ధ్వనించుచున్నది. “నీకున్‌మాకు సగోత్రభావ మగుటన్ ని న్నీకృతిన్ బిడ్డగాఁ , గై కొమ్మంటిని" అనుటలో సగోత్రదత్తత ధర్మ్యమును బ్రశస్తము అని వ్యక్తమగుచున్నది. ఇట్లు సగోత్రులగు దాతృస్వీకర్తల యద్భుత సంఘటన కా నారాయణదైవతమే ముఖ్య కారణమై యుండును.

ఈ విచిత్ర సంఘటనల కన్నిటికి నిదర్శనముగా రామకృష్ణారాయప్రణీతమగు కృతిసమర్పణ నవరత్న మాలిక లోని 'మేరుపూస' యనఁదగు నీ పద్య మరయఁదగినది.

చ. నిరవధియైన భాగ్య మిది ని న్నొక యల్లుని గాఁగఁ జూడ సా
గరునకె దక్కెము; న్నిపుడు కావ్యకలా విభవైక మూర్తి యౌ
గరితను నీ కొసంగు టొక కారణమై తగె నాకు; మామనై
గురుపవనాఖ్య పత్తనవికుంఠనివాస ! నతుల్ ఘటించెదన్ .

ఇందుఁ దాను బంధుసముద్రుఁ డగుటయే కాదు. క్షీరసముద్రున కీడుజోడై' మామకు మామయైన హరికి మామయై కూఁతును నల్లుని నాశీర్వదింపక నమస్కరించుచుంటి ననుటలో భక్తి వినమ్రతను జూపుచు నాత్మగౌరవము కాపాడుకొను చాతుర్యము మెచ్చఁ దగినది. ఆయన హృదయము ప్రత్యేకము పాలసముద్రము. కావుననే యంత సొగసైన కావ్యలక్ష్మి పుట్టినది, ధర్మపత్నీయుతుఁడై, సపరివారుఁడై , మహా వైభవముతో వచ్చి, సాక్షాల్లక్ష్మీనారాయణుఁడేయగు కృతికన్యావరుని హృదయమున స్వకీయకవితారూప నవరత్న మాలికను వై చి, కాళ్లుగడిగి సాలంకృతయగు కృతికన్యను ధారవోయు తనభాగ్యము "నిరవధిక" మని యాయన యనుకొని యానంద తుందిలహృదయుఁ డౌటలో వింత యేమున్నది? గ్రంథాంతమున మంగళాష్టకములో దీక్షితకవి