పుట:నారాయణీయము.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

కృత నారాయణీయమునఁట! నిన్నటిదాఁకఁ దెలంగాణెమునకుఁ బ్రధానమంత్రియై, యాంధ్రరాష్ట్రమును విశాలమొనర్చిన భగీరథుఁడు, నేఁడు కేరళ రాష్ట్రనియంత (గవర్నరు), సంస్కృతాంధ్రములందే కాక ఉర్దూ పార్సీ భాష అందును విద్వాంసుఁడు, కవి, యాంగ్ల భాషా పట్టభద్రుఁడు, న్యాయవాది పంచాననుఁడు, శ్రీశ్రీ బూర్గుల రానుకృష్ణారాయ మహాశయుఁ డది యేమి విద్యావ్యసనమో కాని దత్తపుత్రికగా స్వీకరించెనఁట. ఇందొక విచిత్ర సంఘటనము, “నీకున్ మాకు సగోత్రభావ మగుటన్ ని న్నీకృతిన్ బిడ్డగాఁ గైకొ" మ్మనిన దీక్షిత కవియు, స్వీకరించిన రామకృష్ణారాయమహాశయుఁడును కౌండిన్య సగోత్రులగుట దైవసంకల్పమునఁగాని మానవయత్నమునఁ సిద్ధించు నదియే?

ఈ దత్తపుత్త్రికను సంస్కృత 'నారాయణీయ' కావ్యకర్తయగు శ్రీ నారాయణ భట్టపాదున కారాధ్యదైవతమై, తదీయాభీష్ట శాశ్వతారోగ్య ప్రదాతయై ప్రసిద్ధికెక్కిన శ్రీ గురువాయూరు నారాయణస్వామి దేవునకే కృతిగా నిచ్చుట యఘటనాఘటనా వైచిత్ర్యము కాదా? దీనితోఁ గేరళమునకు నాంధ్రమునకు నక్షరరూపమగు నొక నూత్న బాంధవము. ఆహా ! ఈ గురువాయూరు రామకృష్ణారాయమహాశయపరిపాల్యమగు కేరళ దేశాంతర్గతమగుట యెంత యద్భుత సంఘటనము! ఇవి యన్నియుఁ దలంచు కొనిన నెవ్వని కానందాశ్చర్యములు గలుగవు? ఇట్టి యపూర్వ ఘటనల కన్నింటికి మూలకారణము సృష్టికి మూలకారణమగు పరమేశ్వరునకే తెలియవలెను. కాని యస్మదాదుల కెఱుంగ నగునేమి ?

తొలుదొల్త నారాయణభట్టపాదుఁడు వట్టి నిరక్షరకుక్షియఁట. ఇహ సుఖవరాయణతయే కాని పర మున్నట్లే తలచికూడ నెఱుఁగఁడఁట. అట్టివాఁడు పిషారటీకులమునఁ బుట్టిన కన్యను బెండ్లియాడి, యత్తవారింటనే కాఁపురముండి తద్వంశీయుఁడగు 'అచ్యుతపిషారు'డను మహాపండితుని సోత్ప్రాసవచనముల కులుకుచెంది. అమందమగు నభియోగము ఆ యచ్యుతపిషారు నొద్దనే కావ్యనాటకాలంకారాది సాహితీగ్రంథములనే కాక తర్క, వ్యాకరణాది సకల శాస్త్రముల ననతిచిర కాలమున నధిగమించి సహజధారాళ కవితావిలాసములఁ గేరళదేశ పండితకవిలోకము నుఱ్ఱూత లూఁగించినాఁడఁట. అతని ప్రతిభ కచ్చెరువడి యచ్యుతవిషారుఁడు “అక్కట! విప్రబాలకుఁడ వధ్యయనమ్ము విధిప్రయుక్తము"