పుట:నారాయణీయము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ ఆంధ్ర నారాయణీయ కృతి సమర్పణ

నవరత్న మాల

ఏయదియో మహా సుకృత మే నొనరించితి వాసుదేవ ! శో
భాయుతి వ్యాస భాగవత వాగమృతాంబుధిఁ ద్రచ్చి సారమున్
దీయగఁ దీసి నవ్య నవనీతము విందొనరించి పెట్టి నా
రాయణ భట్టు మాకు వినరా ! నవనీతహరా ! పరాత్పరా !

పోసి తెలుంగుబాస చినిపూవుల తేనియ నీ కవీశ్వరుల్
వాసిలఁజేసి రీ కృతి నెబాసన నందఱు, నాకు బిడ్డగన్
జేసిరి, కావ్య సుందరిని జేకొని నీదు పదారవింద సం
వాస మొసంగి యేలుకొను భర్తవుగా జగదేక సుందరా !

నా సుకృతంబె కాదిది యనారత భక్తిని మూఁడువత్సరాల్
గాసిలి రీ తపోధనులు, కన్యకు నేర్పిరి క్రొత్తలాస్య వి
ద్యా సరణుల్ కళాగళమునం దొక వింత పసందు రాగ.వి
న్యాసము మప్పినారు భవదంఘ్రి సరోరుహా భాగ్య యోథ్యగన్.